ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయి వచ్చే నెల నాలుగవ తేదీన ఫలితాలు రాబోతున్నాయి.అయితే ఈసారి టిడిపి పార్టీ అధికారంలోకి రాకపోతే ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుంది.అందుకే ఈసారి ఎన్నికలు చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు తన సర్వశక్తుల పోరాడారు. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకుని సీట్లు కూడా పంచి ఇచ్చి మరి జాగ్రత్తగా అడుగులు వేశారు.



ముఖ్యంగా చంద్రబాబు కోరుకున్నట్లుగానే ఎన్నికల కమిషన్ తో పాటు ఇతర వ్యవస్థల సహకారాన్ని కూడా పొందినట్లు తెలుస్తోంది. కేవలం కౌంటింగ్ ప్రక్రియ మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. మరి ప్రజలు చంద్రబాబుకు ఏ విధంగా సమాధానం చెప్పారనే విషయం ఒక్కటే ఇప్పుడు మిగిలి ఉంది. టిడిపి పార్టీకి ఎందుకు అధికారం కావాలనే విషయానికి వస్తే.. టిడిపి అనుకున్న ఏకైక లక్ష్యం నెరవేర్చుకోవడం కోసమే అధికారం కోసం ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. అదేమిటంటే ప్రత్యర్థుల పైన వేటు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.


నారా లోకేష్ రెడ్ బుక్ చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. అలాగే గ్రామస్థాయి నుంచి చంద్రబాబు వరకు కూడా టిడిపి నేతలు చాలా ప్రతీకారంతో రగిలిపోతున్నారు. కూటమిలో భాగంగా రాష్ట్రం సర్వనాశనం అవుతుంది ప్రజల బాగోగుల కోసమే తాము అధికారంలోకి వస్తామంటూ మేనిఫెస్టోని చెప్పినప్పటికీ ఈ మేనిపోస్ట్ అమలుపైన దృష్టి పెడతారనుకుంటే అది అజ్ఞానమే అని చెప్పవచ్చు. కేవలం ప్రత్యర్థులను దెబ్బతీయటమే వీరి లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా పథకాలను కూడా చంద్రబాబు తీసివేస్తారని ఇప్పటికే ప్రజలు కూడా చాలామంది ఈ విషయాన్ని నమ్ముతున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పిన పనులన్నీ ఏమి చేయలేదని కూడా వినిపిస్తూ ఉంటాయి. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలని సాధ్యం కానీ హామీలను సైతం చెప్పారు చంద్రబాబు.మరి టిడిపి ఆలోచనలు అన్నీ కూడా ప్రత్యర్థులను టార్గెట్ చేయడమే అన్నట్టుగా తెలుస్తోంది. మరి టిడిపి అనుకున్నట్టుగా జరుగుతుందా లేదా జూన్ 4న ఫలితాలు తేలుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: