ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వస్తామని వైసిపి పార్టీ గట్టిగా చెబుతోంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత... ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల కంటే గట్టిగానే కొడుతున్నామని... 150కి పైగా సీట్లు వస్తాయని జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. అనంతరం లండన్ కు వెళ్లిపోయారు జగన్. దీంతో వైసిపి పార్టీ... శ్రేణులు అలాగే నాయకులు ఫుల్ జోష్ లో కనిపిస్తున్నారు. జగన్ చెప్పాడు కాబట్టి కచ్చితంగా... ఏపీలో మరోసారి విజయం సాధించబోతున్నామని వైసిపి నాయకులు చెబుతున్నారు.


అయితే దీనికి బలం చేకూరేలా వైసిపి పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. అదే వైసిపి పార్టీ ఆఫీస్ షిఫ్టింగ్ అంశం.  అతి త్వరలోనే విశాఖపట్నం కి వైసీపీ స్టేట్ కార్యాలయం షిఫ్ట్ కానుందట. ఇప్పుడు వైసీపీ స్టేట్ కార్యాలయం షిఫ్ట్  అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. వైసిపి పార్టీ రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖ వేదికగా ప్రమాణస్వీకారం చేస్తానని... ఇప్పటికే జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. విశాఖపట్నంలోనే ఉండి పాలన కొనసాగిస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో తెలిపారు.

ఇందుకు తగ్గట్టుగానే.... జూన్ తర్వాత మంచి ముహూర్తం చూసి... వైసిపి పార్టీ ప్రధాన కార్యాలయాన్ని షిఫ్ట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారట. విశాఖ నుంచి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలను... అధికారంలోకి వచ్చిన తర్వాత...  ప్రభుత్వ కార్యకలాపాలను విశాఖ నుంచి జరపాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారట. ఇక దీనికి తగ్గట్టే మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విశాఖ శివారులో ఏడాది కిందట రెండు ఎకరాల భూమి తీసుకున్న వైసీపీ పార్టీ...  అక్కడ స్టేట్ ఆఫీస్ నిర్మాణం చేపట్టింది. ఇక... ఆ కార్యాలయ నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. సుమారు 13 వేల చదరపు అడుగులతో ఈ కార్యాలయాన్ని నిర్మించారు. జి ప్లస్ భవనాన్ని... వైట్ బ్లూ గ్రీన్ కలర్స్ తో చాలా చక్కగా నిర్మిస్తున్నారు. మొదటి అంతస్తులో జగన్మోహన్ రెడ్డి చాంబర్ ఉండేలా ప్లాన్ చేశారు. ఇక ఈ కార్యాలయం పూర్తి అయిన నేపథ్యంలో... జూన్ మాసంలో వైసిపి కేంద్ర కార్యాలయం విశాఖకు షిఫ్ట్ కానున్న అన్నమాట. అటు జగన్‌ కుటుంబం కూడా విశాఖకు షిఫ్ట్‌ కానుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: