ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై అందరూ ఆసక్తికరంగా ఉన్నారు. అయితే.. ముఖ్యంగా దెందులూరు లో వైసీపీ, టీడీపీ నేతలు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. దెందులూరు వైసిపి కంచుకోటగా అవుతుందని అబ్బయ్య చౌదరి లెక్కలు వేసుకున్నారు. మూడోసారి గెలిచి తీరుతానని చింతమనేని ప్రభాకర్ ధీమాగా ఉన్నారు. జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని అబ్బయ్య చౌదరి భావిస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలు కలిసి వస్తాయని చింతమనేని ధీమాలో ఉన్నారట. 2014లో 86.82, 2019లో 85.11 శాతం పోలింగ్ నమోదు అయింది.


తాజా ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఒక్క శాతం పెరగడంతో రెండు పార్టీ నేతలు తమకు అనుకూలం అంటే లేదు లేదు తమ వైపు ఓటర్లు మొగ్గు చూపారు అంటున్నారు. 2019 ఎన్నికల్లో హోరాహోరీగా సాగిన  ఎన్నికల్లో  చింతమనేని ప్రభాకర్ పై అబ్బయ్య చౌదరి 16,131 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన తీరు పరిశీలిస్తే 2019 ఎన్నికల్లో లక్ష 86 వేల 443 మంది ఓటు హక్కు వినియోగయించుకున్నారని అధికారులు చెబుతున్నారు.


ఇందులో పురుషులు 92,312 మంది, మహిళలు 94, 113 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 1128 పోస్టల్ ఓట్ల కలిపి 85.11% పోలింగ్ నమోదయింది.  ఇక తాజా ఎన్నికల్లో 2,24,013 మంది ఓటర్లు ఉంటే వారిలో లక్షా 92,901 మంది ఓటు వేశారు. ఓవరాలుగా 86.11 శాతం పోలింగ్‌ నమోదయిందన్న మాట. ఇందులో పురుషులు 95,410 మంది, మహిళలు 97,536 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గత ఎన్నికల కంటే ఒక్క శాతం పోలింగ్ ఇక్కడ పెరిగినట్టు స్పష్టం అవుతుంది.


రెండవసారి చింతమనేని ప్రభాకర్ ను ఓడించాలని లక్ష్యంతో పనిచేశారు సిట్టింగ్  ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. దెందులూరు అంటే కేవలం వివాదాలకు కేరాఫ్ అడ్రస్  అనే పేరు నుంచి ప్రశాంతమైన ప్రాంతంగా ఉంచే ప్రయత్నాలు సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభాకర్ పై కేసులు తీవ్రత పెరిగింది.కానీ ఇప్పుడు వైసీపీ వ్యతిరేకత తీవ్రంగా ఉందని.. అందుకే ఓటింగ్‌ శాతం పెరిగిందని చింతమనేని అంటున్నారు. అందుకే ఈ సారి గెలుస్తున్నానని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: