ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు మే 13న ముగిసాయి. మరో వారం రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఎన్నికలు పూర్తయి ఇప్పటి దాదాపు 15 రోజులు గడిచిపోయాయి. అయితే చంద్రబాబు ఈసారి తమ పార్టీ గెలవబోతోంది అని ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకుముందు తమకు ఫలానా సీట్లు వస్తాయి అని చెప్పేవారు ఈసారి ఎలాంటి కామెంట్లు చేయలేదు. ఆయన ఒక్కరే కాదు ఏ టిడిపి నేత కూడా విజయం తమదే అని ఇన్ని సీట్లు గెలవబోతున్నామని చెప్పలేదు. ఇక ఎల్లో మీడియా కూడా పోలింగ్ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయాయి.

ఇదిలా ఉంటే అధికార పార్టీ వైసీపీ నేతలు మాత్రం గెలుపు తమదే ఈసారి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ లండ‌న్‌కు వెళ్లే ముందు ఐప్యాక్ టీమ్‌ను కలిసారు. ఆ సందర్భంగా పోయినసారి కంటే ఈసారి ఎక్కువ మెజారిటీతో తన గర్వబోతున్నామని చరిత్రలో ఆ విజయం నిలిచిపోతుందని అన్నారు. దేశం మొత్తం ఆశ్చర్యపడేలా అతను ఫలితం ఉండబోతుందని కామెంట్లు చేశారు. 151 పైగానే సీట్లు తాము గెలుచుకుపోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇతర నాయకులు కూడా  125 నుంచి 160 దాకా రాము అసెంబ్లీ సీట్లు గెలుచుకుపోతున్నామని ప్రకటన చేశారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, లోకేష్ ఇలా ఎవరు కూడా టీడీపీ కూటమి గెలుస్తుందని ధైర్యంగా ఒక ప్రకటన చేయలేకపోయారు.

అమిత్ షా వంటి కేంద్ర నాయకులు మాత్రం బీజేపీ టీడీపీతో కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని నమ్మకంగా చెప్పుకొచ్చారు. వాళ్లలో ఉన్న నమ్మకం చంద్రబాబులో లేకపోయింది. ఈసారి పోలింగ్ రికార్డు స్థాయిలో నమోదయింది కాబట్టి ఎవరు గెలిచినా భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈసారి ఎవరు అధికారంలోకి వచ్చినా కొన్ని సవాళ్లు ఎదురవుతాయని చెప్పుకోవచ్చు. జగన్ గెలిస్తే మద్యపానం విషయంలో, అలాగే రోడ్లు అభివృద్ధి వంటి అంశాలలో సవాళ్లను ఎదుర్కొంటారు. చంద్రబాబు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేయడంలో చాలా ఇబ్బందులను ఫేస్ చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: