ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి.. ఎవరి అంచనాలు వాళ్లు తెలియజేస్తున్నారు.. ఇటు తెలుగుదేశం పార్టీకి రైజ్ కావచ్చు.. మరి కొన్ని సర్వేలు వైసిపి పార్టీకి అనుకూలంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇతర సంస్థలు కూడా ఇరువురి పార్టీలకు సంబంధించిన సర్వేలను విడుదల చేస్తూ ఉన్నాయి. వైయస్సార్ పార్టీకి సంబంధించి పార్దాదాస్ సర్వే.. గతంలో కూడా వైసిపి పార్టీ వస్తుందంటూ తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ సేపాలజిస్ట్.. కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ ,తెలంగాణ ఈ మూడు చోట్ల కూడా సంక్షేమ పథకాల ఇంపాక్ట్ మహిళల మీద చాలా చూపించింది అంటూ తెలియజేశారు.


ముఖ్యంగా కర్ణాటక తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కూడా బాగా ఇంఫ్యాక్ట్ చూపించింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం నవరత్నాలు ఇంపాక్ట్ చూపించాయని తెలియజేస్తున్నారు. మహిళల ఓట్లు చాలా కీలకంగా కాబోతున్నాయి అంటూ రిజల్ట్స్ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంటాయని షాకింగ్ గా రాబోతున్నాయని అన్నటువంటిది ఆయన అంచనాగా తెలియజేశారు. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి పార్దాదాస్ తెలియజేశారు. అదే సమయంలో పిడిఎస్ శర్మ .. ఎవరైతే సఫాలజిస్ట్ చెబుతున్నటువంటి లెక్కలలో ఏమిటంటే..


ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా అసెంబ్లీలలో క్లియర్ గా చాలా స్పష్టత కనిపిస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నే మళ్లీ అధికారం దక్కించుకుంటుందంటూ.. 97 నుంచి 114 స్థానాలను దక్కించుకుంటుందంటు అంచనా వేశారు. ఒరిస్సాలో కూడా బీజూ జనతా దళ్  పార్టీ అధికారంలోకి వస్తుందంటూ అంచనా వేశారు. ముఖ్యంగా అక్కడ మహిళలు కూడా నమ్ముతున్నారని కూడా తెలియజేస్తున్నారు. 80 నుంచి 102 సీట్లతో అక్కడ జనతాదళ్ పార్టీ అధికారాన్ని అందుకుంటుందని అంచనాని తెలియజేస్తున్నారు. ఈ రెండు చోట్ల కూడా ఈ విధంగా ఉంటుందని పిడిఎస్ శర్మ తెలియజేశారు. మరి అందరూ అనుకున్నట్టుగానే వైసిపి పార్టీ అధికారంలోకి వస్తుందా లేకపోతే కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయం జూన్ 4వ తేదీన తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: