ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి... ఏపీలో ఒకే ఒక్క పేరు మారుమోగుతోంది. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి. తెలుగుదేశం కూటమి సభ్యులందరూ నిత్యం... ప్రెస్మీట్లో పెట్టి జవహర్ రెడ్డిని టార్గెట్ చేశారు. వైసిపి కంటే ఎక్కువగా జవహర్ రెడ్డిని టార్గెట్ చేసి... చాలా ఇబ్బందులు పెట్టారు. వైసిపికి కోవర్టుగా జవహర్ రెడ్డి ఉన్నారని... వెంటనే ఆయనను బదిలీ చేయాలని తెలుగుదేశం మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది.


కానీ జవహర్ రెడ్డి...గత హిస్టరీ పరిశీలించిన ఎన్నికల సంఘం... ఆయనపై వేటు వేయలేదు. ఆయన నిబద్ధత, నిజాయితీ అలాగే పనితీరును  గుర్తించి... ఏపీ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు  ఆంధ్రప్రదేశ్ సీఎస్ గా కొనసాగించింది ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం ఉంచిన ఆ నమ్మకంతో... తన వంతు పాత్రను చాలా సమర్థవంతంగా నిర్వహించారు జవహర్ రెడ్డి.


అధికార వైసిపి పార్టీకి అనుకూలంగా... వ్యవహరించకుండా... వెంటనే వాలంటీర్ వ్యవస్థను  తాత్కాలికంగా నిలిపివేశారు. సంక్షేమ పథకాలలో అవకతవకలు జరగకుండా కూడా... దగ్గరుండి పరిశీలించారు జవహర్ రెడ్డి. రెడ్డి ఉన్నంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటారా ? అంటూ తనకు ప్రజలే ముఖ్యం   అన్న తీరులో జవహర్ రెడ్డి వ్యవహరించారు.  తెలుగుదేశం కూటమి సభ్యులు... జవహర్ రెడ్డి పై చాలా ఆరోపణలు చేశారు.


ముఖ్యంగా ఉత్తరాంధ్రలో 2000 కోట్ల అసైన్డ్ భూములు కొట్టేసారని... జవహర్ రెడ్డి పై సంచలన ఆరోపణలు కూడా తెరపైకి తీసుకువచ్చారు. దానికోసమే జీవో 596 తీసుకువచ్చారని కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. జవహర్ రెడ్డి తన కుమారుని పేరు పైన 800 ఎకరాలను మార్పిడి చేసుకున్నాడని కూడా ఆరోపణలు చేశారు.  ఇలా జవహర్ రెడ్డి పైన ఎన్ని ఆరోపణలు చేసినా కూడా.. ఎక్కడ తగ్గలేదు ఆయన. రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను వినియోగించుకుంటూ... ఏపీ ఎన్నికలు సక్రమంగా జరిగేలా... న్యూట్రల్ గా ఉండి తన పదవికి అందం తెచ్చారు జవహర్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: