ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ పార్టీలలో తెలుగుదేశం పార్టీ ఒకటి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి సారి 2014 వ సంవత్సరం అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కావలసినన్ని అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని ఆంధ్ర రాష్ట్రంలో మొదటి సారి ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇక ఐదు సంవత్సరాలు పాటు వీరి పరిపాలన సాఫీ గానే ముందుకు సాగింది. 2019 వ సంవత్సరం జరిగిన ఎన్నికలలో వీరే అధికారంలోకి వస్తారు అని చాలామంది భావించారు.

కాకపోతే ఈ ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగానో , జగన్ ఇంతకంటే బాగా పరిపాలిస్తాడు అన్న నమ్మకం తోనో రెండవ సారి వైసీపీ పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయాన్ని అందుకుంది. దానితో వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో తిరుగులేకుండా పోయింది. ఇక 2019 నుండి మొన్నటి ఎన్నికల వరకు వైసీపీ పార్టీ ప్రజలను ఆకర్షించే పథకాలను ప్రవేశ పెట్టడంలోనూ , వాటిని అమలు చేయడం లోనూ బాగానే సక్సెస్ అయ్యింది. ఇక తెలుగు దేశం పార్టీ ఈ సారి జనసేన , బీజేపీ లతో పాటు పోటీలో పోటీ దిగింది. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఏ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందా అనేది చెప్పడం కష్టంగా మారింది.

ఒక వేళ టీడీపీ కనుక ఈ దఫా అధికారంలోకి రాకపోయినట్లు అయితే తెలుగు దేశం పార్టీలోని కీలక నాయకుల పరిస్థితి ఏమవుతుందా అనేదే చాలా మందికి అంతు పట్టడం లేదు. వీరంతా కచ్చితంగా తెలుగు దేశం అధికారం లోకి వస్తుంది అనే ఉద్దేశంతో వైసిపి పార్టీపై అనేక విమర్శలు చేయడం , మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉంటూ వస్తున్నారు. విరు అలాగే ఉంటారా..? అలాగే ఉంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు సాఫీగా ముందుకు సాగుతుందా అనే ప్రశ్న జనాల్లో నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: