ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె వై యస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి కావడానికి ఎంతగానో సహకారం అందించింది. జగన్ సీఎం అయిన తర్వాత వీరి కుటుంబంలో కొన్ని కలహాలు రావడంతో షర్మిల జగన్ కి దూరంగా ఉంటూ వచ్చింది. ఇక జగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో పాటిస్పేట్ చేస్తూ ఉండటంతో ఈమె తెలంగాణ పై ఫోకస్ పెట్టింది.

అందులో భాగంగా ఒక పార్టీ ని కూడా స్థాపించి కొత్త కాలం పాటు ఆ పార్టీ ని తెలంగాణ లో డెవలప్ చేయడానికి చాలా ప్రాంతాలను కూడా తిరిగింది. అలాగే చాలా రోజులపాటు పాదయాత్ర కూడా చేసింది. ఇక చాలా రోజులు తెలంగాణ లోని అనేక ప్రాంతాలను తిరిగి తన పార్టీని డెవలప్ చేయడం కోసం ప్రయత్నాలు చేసిన ఈమె చివరిగా ఎలక్షన్ల ముందు మాత్రం తన పార్టీని తెలంగాణ లో పోటీలో ఉంచలేదు.

తెలంగాణ నుండి ఈమె కొన్ని రోజుల క్రితమే ఆంధ్ర రాష్ట్రాల రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉంది. ఇకపోతే ఈమె తన సొంత సోదరుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కి ఆపోజిట్ గా నిలబడడం , ఆయన ఓడిపోవాలి అని ప్రచారాలను చేయడంతో జగన్ అభిమానులు ఆమెపై గరం గరం అయ్యారు.

ఇక ఒక వేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన , రాకపోయినా జగన్ అభిమానులు మాత్రం ఈమెపై ఎప్పుడు సీరియస్ గా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇకపోతే తాజాగా ఈమెకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. అది ఏమిటి అంటే ... ఈమెకు పార్టీ ఫండ్ 50 కోట్ల రూపాయలు వచ్చింది అని , వాటన్నింటినీ షర్మిల ఏం చేసింది అని ఒక వార్త వైరల్ అవుతుంది. మరి దీనిపై ఈమె ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: