రాష్ట్రంలో కీలక పార్టీలు దక్కించుకోవాలి అనే అసెంబ్లీ స్థానాలలో దర్శి అసెంబ్లీ స్థానం ఒకటి. మొదటి నుండి కూడా ఈ ప్రాంత సీటుపై రెండు ప్రధాన పార్టీలు కన్ను వేశాయి. అందులో భాగంగా ఎంతో ఆచితూచి ఈ నియోజకవర్గం లో జగన్ అభ్యర్థిని ఎంపిక చేశారు. 2019 వ సంవత్సరం ఈ ప్రాంతం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ బరిలోకి దిగారు. ఇక ఈయన భారీ మెజారిటీ తో 2019 వ సంవత్సరం గెలుపొందారు. 2019 వ సంవత్సరం ఈయన దర్శి నుండి గెలుపొందడంతో 2024 వ సంవత్సరంలో కూడా ఈ ప్రాంత సీటును ఎక్స్పెక్ట్ చేశారు.

కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎంతో వ్యూహాత్మకంగా ఈ ప్రాంత సీటును ఈ సారి సెట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ కు కాకుండా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కి ఇచ్చారు. ఇకపోతే ఈయన 2009 వ సంవత్సరం దర్శి ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి గెలుపొందారు. ఇక ఆ తర్వాత ఈయన మళ్లీ 2024 వ సంవత్సరం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ప్రాంతం నుండి కూటమి గొట్టిపాటి లక్ష్మీ అనే మహిళా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఇకపోతే ప్రస్తుతం దర్శి లో ప్రధాన ప్రత్యర్ధులు అయినటువంటి శివప్రసాద్ రెడ్డి , లక్ష్మీ ఇద్దరు కూడా డాక్టర్లు కావడం విశేషం.

ఈ మరి ఇప్పటికే ఒక సారి దర్శి ప్రాంతానికి ఎమ్మెల్యేగా పని చేసిన శివ ప్రసాద్ రెడ్డి గెలుపొందుతారా..? లేకపోతే మహిళా అభ్యర్థి మరియు రాజకీయాలకు కొత్త అయినటువంటి లక్ష్మీ సైడ్ ఈ ప్రాంత జనాలు నిలబడతారా అనేది సస్పెన్స్ గా మారింది. ఇక వైసీపీ మాత్రం ప్రస్తుతం ఈ ప్రాంతంలో తమ పార్టీ అభ్యర్థి గెలిచి ఉండడంతో కచ్చితంగా ఇక్కడ మరోసారి తమ జెండా పాతాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యి భారీ ఎత్తున ప్రచారాలను కూడా నిర్వహించింది. ఇక కూటమి ఈ సారి ఎలాగైనా ఈ ప్రాంతంలో తమ జెండాను ఎగరవేయాలి అని గట్టిగా ప్రయత్నాలు చేసింది. మరి ఈ ఇద్దరిలో దర్శి అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలుస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: