దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా ఆరు విడుదల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఏడవ విడత జూన్ మొదటి వారంలో జరగనుంది. దీంతో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ పూర్తిగా ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు రానున్నాయి. అయితే ఫలితాలు రాకముందే... ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు ఇప్పటికే చెప్పేసాయి.


 దీంతో ప్రధానికి నరేంద్ర మోడీ మూడవ కేబినెట్లో మంత్రి పదవుల కోసం... ఇప్పటినుంచి నేతలందరూ  ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ లిస్టులో ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు  ముందు వరుసలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి నుంచి కచ్చితంగా గెలుస్తారని తెలుస్తోంది. దీంతో ఆమెకు కేబినెట్ పక్కా అని అంటున్నారు. ఇక అటు అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన సీఎం రమేష్ కు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా...  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి..  నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కూడా కేంద్ర మంత్రి పదవి వస్తుందని చెబుతున్నారు. ఈ ముగ్గురు నేతల్లో  ఇద్దరికీ కేంద్ర మంత్రి పదవి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి నేషనల్ మీడియా సంస్థలు.

 

అయితే మోడీ మూడవ కేబినెట్లో...  తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలకు ఛాన్స్ ఇవ్వబోరని తెలుస్తోంది. ఎందుకంటే బిజెపి నేతలు ముగ్గురు లైన్లో ఉన్నారు.. అటు తెలంగాణలో కూడా పోటీ ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో... తెలుగు రాష్ట్రాలకే ఎక్కువ మంత్రి పదవులు ఇస్తే... బాగుండదని బిజెపి అధిష్టానం భావిస్తోందట.   అందుకే నరేంద్ర మోడీ కేబినెట్ విస్తరణలో... జనసేన మరియు తెలుగుదేశం పార్టీలకు చాన్స్ ఉండబోదని తెలుస్తోంది. 
ఇక తెలంగాణ రాష్ట్ర విషయానికి వస్తే... తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్ అలాగే డీకే అరుణ లకు  మంత్రి పదవి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp