ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థులంతా జూన్ 4న ఎవరు గెలవబోతున్నారనే ఆందోళనలో ఉన్నారు. అలాంటి ఈ తరుణంలో
 ఏపీలో టిడిపి ఈసారి  పుంజుకుందనే చెప్పవచ్చు. అంటే అధికారంలోకి వస్తుందనేది క్లారిటీగా చెప్పలేము కానీ కొన్ని నియోజకవర్గాల్లో టిడిపి  చరిత్ర తిరగరాయబోతోంది.     మరి ఆ నియోజకవర్గాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం.

టిడిపి మాచర్ల నియోజకవర్గం లో గెలిచి కొన్ని ఏళ్లు గడుస్తోంది. 1999లో చివరిసారి గెలుపు బాగుటా ఎగరవేసింది. ఈసారి అక్కడ టైట్ గా ఉన్నప్పటికీ టిడిపికి కలిసివచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. దీని తర్వాత కందుకూరు నియోజకవర్గం కూడా అదే కోవలోకి వస్తోంది. ఇక్కడ కూడా 1999 లోనే చివరిసారి టిడిపి గెలిచింది. ఈ మధ్యలో రెండు సార్లు కాంగ్రెస్, రెండుసార్లు వైసిపి గెలిచింది కానీ ఈసారి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నెల్లూరు సిటీ మరియు నెల్లూరు రూరల్ లో కూడా టిడిపి ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట.

అంతేకాకుండా బాపట్ల నియోజకవర్గం కూడా ఇక్కడ టఫ్ ఫైట్ ఉన్న టిడిపికి కలిసి వస్తుందట. మంగళగిరి కూడా టిడిపి జెండా ఎగరబోయిపోతుందట. ఈసారి విశాఖపట్నం ఎంపీ సీట్ కూడా టిడిపి భారీ మెజారిటీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే కాకుండా తుని నియోజకవర్గం కూడా టిడిపికి ఈసారి కలిసి వస్తుందట. ఈ విధంగా ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా 20 నుంచి 25 సంవత్సరాల నుంచి ఇతర పార్టీలు గెలుస్తూ వస్తున్నాయి. అలాంటి ఈ తరుణంలో టిడిపి నాయకులు కూడా ఈ నియోజకవర్గాల్లో విపరీతంగా తిరుగుతూ పేద ప్రజలకండగా ఉంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రచారంలో దూసుకుపోయారని చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే వారు రెండు నుంచి నాలుగు సార్లు ఓడిపోయిన సింపతి కూడా కలిసి వస్తుంది. ఈసారి ఈ నియోజకవర్గాల్లో తప్పక టీడీపీ విజయ బాగుంటా ఎగరవేస్తుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: