ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ మొదలుకానుంది. ఏపీ ఎన్నికల ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. బాబు సీఎం అవుతారని 50 శాతం మంది చెబుతుండగా జగన్ సీఎం అవుతారని 50 శాతం మంది చెబుతున్నారు. అర్బన్ ఓటర్లు కూటమికి అండగా నిలవగా రూరల్ ఓటర్లు మాత్రం వైసీపీకి అండగా నిలవడం గమనార్హం. బాబు పాలన, జగన్ పాలన విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
 
వైసీపీ గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుండగా కూటమి నేతలు మాత్రం సైలెంట్ గానే ఉంటున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యే అదృష్టం ఎవరిదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. ఫలితం ఎలా ఉన్నా నేతలు ఆ ఫలితాన్ని స్వీకరించక తప్పదు. బీజేపీ, జనసేన పొత్తు టీడీపీకి మేలు చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏ పార్టీ గెలిచినా పూర్తిస్థాయి మెజారిటీతో గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
 
ఈ ఫలితాలు ఏపీ రాజకీయాలను మార్చే ఫలితాలు అని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్, చంద్రబాబులలో ఎవరు సీఎం అయినా సోషల్ మీడియా వార్స్ మాత్రం మొదలయ్యే అవకాశం ఉంది. ఏ పార్టీ గెలిచినా ఓడినా మేనిఫెస్టో, పొత్తు కారణమవుతాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బీజేపీతో పొత్తు టీడీపీకి వరమో శాపమో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
 
ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ పార్టీ నేతలకు ఆనందాన్ని కలిగిస్తాయో ఏ పార్టీ నేతలకు బాధను మిగుల్చుతాయో చూడాల్సి ఉంది. ఏపీ ఎన్నికల ఫలితాలపై ఇతర రాష్ట్రాలు సైతం ఫోకస్ పెట్టాయి. ఏపీలో ఇప్పటివరకు జగన్ అమలు చేసిన పథకాలు ప్రజలపై ఏ మాత్రం ప్రభావం చూపాయో ఈ ఎన్నికల ఫలితాలతో క్లారిటీ రానుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ సపోర్ట్ మాత్రం కూటమికే ఉంది. జగన్ కు వ్యతిరేకంగా కొన్ని ప్రముఖ ఛానెళ్లు రేయింబవళ్లు కష్టపడి ప్రచారం చేశాయనే సంగతి తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి: