ఎంతోమంది నేతలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ అనూహ్యంగా మంత్రి పదవి దక్కించుకున్న నాయకుడు ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ బిజెపి పార్టీ తరఫున నిలబడి గెలవడం జరిగింది. కేవలం రెండు నెలల కాలంలోనే టికెట్ సాధించి మరి గెలిచి చూపించారు.దీంతో పాటు మంత్రి పదవితో కూడా మరొక సంచలనాన్ని సృష్టించారు సత్య కుమార్ యాదవ్.. అంతేకాకుండా జాతీయ నేతల ఆశీస్సులు కూడా ఆయనకి ప్లస్ అయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా అగ్ర నేతల అండదండల వల్లే ఆయన నెగ్గుకొచ్చారు. ఇప్పుడు ఈ విషయమే ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారిపోయింది.మహామహులను తలదన్ని ఇప్పుడు ఏకంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లోని ఏకైక బిజెపి మంత్రిగా అవకాశాన్ని కొట్టేశారు.. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దగ్గర కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి సత్యకుమార్ అనూహ్యంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. బిజెపి తరఫున హిందూపురం ఎంపీ టికెట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు సత్య కుమార్ యాదవ్.. అనుకోకుండా ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం లో సీటు రావడంతో అభ్యర్థి బరిలో దిగారు ఒక్కసారిగా అందరి అంచనాలను తనకిందలు చేశారు.ముఖ్యంగా అక్కడ వైసిపి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మీద గెలిచి ఒక సంచలనం సృష్టించారు సత్య కుమార్.. వెంకయ్య నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నప్పటికీ బీజేపీ పార్టీకి అతి సన్నిహితంగా ఉన్న సత్యకుమార్ పంచుకొని బిజెపి పార్టీ నుంచి సీటు దక్కించుకున్నారు. దాదాపుగా ఎనిమిది మంది గెలిచిన కేవలం సత్య కుమార్ కే మంత్రి పదవి ఇవ్వడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని సమాచారం. సత్య కుమార్ కు మంత్రి పదవి ఇవ్వడానికి ముఖ్య కారణం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రభావం ఉన్నట్లు సమాచారం. బిజెపి జాతీయ రాజకీయాలకు దగ్గరుండి చూసిన సత్య కుమార్కు ఈ పదవి దక్కడం వెనుక రాబోయే రోజుల్లో మరింత కలిసి వస్తుందని విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: