ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు కూటమిలో భాగంగా నిన్నటి రోజున ప్రమాణస్వీకారం చేశారు.. ఇలాంటి సమయంలోనే వైసిపి పార్టీ రాజ్యసభ సభ్యుల సైతం ఢిల్లీలో మీడియా సమావేశాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.. ఒక రకంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కూడా తమ జోలికి ఎవరు రావద్దని సంకేతాలను సైతం బిజెపికి పంపించినట్లు సమావేశం జరిగినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టిడిపి పార్టీ శ్రేణులు తమ నేతల పైన కార్యకర్తల పైన చేస్తున్న దాడులను జాతీయస్థాయికి తీసుకువెళ్లాలని విషయం పైన తెలియజేసిన తర్వాతే బిజెపికి మద్దతుగా ఉంటాం అనే విషయాన్ని నేరుగా చెప్పేసేలా ఇలా ప్లాన్ చేశారట.


వైసీపీ రాజ్యసభ 11 మంది సభ్యుల బలం ఉన్నది ఇప్పటికి బిజెపికి పైన ఆధారపడి ఉండాల్సి ఉన్నదంటూ విజయ్ సాయి రెడ్డి వెల్లడించారు. టిడిపి పార్టీకి ఒక రాజ్యసభ సభ్యుడు కూడా లేరని తెలుస్తోంది. మొత్తం ఆ పార్టీకి ఉన్న ఎంపీలతో పోలిస్తే టిడిపి పార్టీకి ఒక ఎంపీ సీటు కూడా ఎక్కువగానే ఉందని చెప్పారు. 2014-19 నుంచి టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ బీజేపీతో జగన్ ఎక్కువగా సన్నిహిత సంబంధాలు ఉండేవి.


ఈ సంబంధాలు కుదరడంలో విజయసాయిరెడ్డి ది కీలకమైన పాత్ర. ముఖ్యంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా పేరుతో ఎన్డీఏ కూటమి నుంచి బయటికి రావాలంటే టిడిపి పైన చాలా ఒత్తిడి తెచ్చారు. అయితే అప్పటికన్నా ఇప్పుడు మరింత బలహీనంగా వైసిపి పార్టీ ఉన్నది. దీంతో 11 మంది రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటువంటి సమయంలో తమ మద్దతు బిజెపికి ఉంటుందని మోదీ, అమిత్ షాక్ అలాంటి సంకేతాలు కూడా పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో బిజెపి నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. టిడిపి పార్టీ పైన ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయంపై తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: