జగన్ అండ్ గ్యాంగ్ ఇక జైలుకేనా అంటే, అవుననే సమాధానం చెప్పే పరిస్థితి రాబోతోంది. అవును, ఏపీలో అధికారం చేతులు మారింది తప్పితే మిగిలింది అంతా సేం టూ సేం అన్న మాదిరి వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది అన్నట్టు మాట్లాడుతున్నారు విశ్లేషకులు. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకి ఇపుడు రియాక్షన్ చూడబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

విషయం ఏమిటంటే, అవులపల్లి ప్రాజెక్ట్ లో పెద్దిరెడ్డి దాదాపు 600 కోట్ల రూపాయల మేర అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఇది ఒక్క ఉదాహరణ మాత్రమేనని, మిగిలిన ఇరిగేషన్ ప్రాజెక్టులలో కూడా చాలా అవినీతి జరిగే ఉంటుంది అనే అనుమానాలు వ్యక్తం చేసారు. దీనిని బట్టి చూస్తే తొందరలోనే వీటి మీద విచారణ జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక విద్యా శాఖలో కొండంత అవినీతి జరిగిందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విషయంలో ఇప్పటికే ఏసీబీఎకి టీడీపీ నేత వర్ల రామయ్య బృందం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసినదే. టీచర్ల బదిలీలలో కోట్ల సొమ్ము చేతులు మారింది అన్నది ప్రధాన అభియోగం. అంతేకాకుండా విద్యా రంగంలో గత అయిదేళ్ళుగా సాగిన అవకతవకల మీద విచారణ చేయాలని చూస్తున్నారు.

అదేవిధంగా గనుల శాఖతో పాటు అటవీ శాఖ, ఎక్సైజ్ శాఖ ఇలా కీలక శాఖలలో జరిగిన అవినీతి మీద విచారణకు కొత్త ప్రభుత్వం రంగం సిద్ధం షురూ చేసింది. ముఖ్యంగా జగన్ ని కేంద్రంగా చేసుకుని విచారణలు చేపట్టబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. లిక్కర్ స్కాం విషయంలో జగన్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిల పాత్రల మీద సమగ్ర దర్యాప్తు చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కంటే ఏపీలోనే పదింతలు స్కాం జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏపీలో మద్యం స్కాం మీద ఈడీ సీబీఐలతో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్రాన్ని కోరిన సంగతి అందరికీ తెలిసినదే. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం అంటూ ఎక్సైజ్ శాఖకు చెందిన ఉన్నతాధికారి వాసుదేవరెడ్డి మీద కేసు నమోదు చేసిన ప్రభుత్వం మరింత లోతులకు వెళ్ళేలా ఉంది అని అంటున్నారు. ఇవేగాని జరిగితే జగన్ అండ్ గ్యాంగ్ ఇక జైలుకేనా? అన్న అనుమానానికి ఫుల్ క్లారిటీ రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: