ఏపీలో ఎన్నికల ముందు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి జరిగిన చర్చ, రచ్చ అంతాఇంతా కాదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మంచి చట్టమే అయినా ఆ చట్టంలో ఉన్న కొన్ని లోపాల వల్ల రైతులు భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం చంద్రబాబు నాయుడు ఈ చట్టం రద్దు దిశగా అడుగులు వేసి మంచి పని చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో బాబు పేదల గుండెల్లో గుబులు తగ్గించారు.
 
మరోవైపు వైసీపీ ఆధ్వర్యంలో ముద్రించిన భూ హక్కు పత్రాల పంపిణీని నిలిపివేయాలని ఎన్డీయే సర్కార్ కీలక నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం హాట్ టాపిక్ అవుతోంది. రీ సర్వే విషయంలో మాత్రం చంద్రబాబు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం అందుతోంది. పట్టాదారు పాస్ పుస్తకంపై జగన్ ఫోటోను ముద్రించడం విషయంలో ఒకింత విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.
 
సర్వే రాళ్లపై వైఎస్సార్ జగనన్న భూరక్ష 2020 పేరు ఉండేలా గత పాలకులు చర్యలు తీసుకోగా రీసర్వే చేసిన గ్రామాలకు సరఫరా చేయకుండా లక్షల సంఖ్యలో రాళ్లు గ్రానైట్ పరిశ్రమలలో నిల్వ ఉన్నాయని సమాచారం అందుతోంది. వాటిపై రంగు వేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుతో అంతా కుశలమేనని ప్రచారం జరుగుతోంది.
 
చంద్రబాబు రైతుల కోసం ప్రకటించిన ఇతర హామీలను సైతం చెప్పిన విధంగా అమలు చేస్తే మాత్రం రైతుల మద్దతు చంద్రబాబుకు పూర్తిస్థాయిలో ఉంటుందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు వచ్చే ఐదేళ్లు అద్భుతమైన పాలనను అందించాలని నెటిజన్ల నుంచి, సామాన్యుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేతలు గతంలో చేసిన తప్పులు రిపీట్ కాకుండా టీడీపీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పవచ్చు. కూటమికి ఈ స్థాయిలో సీట్లు రావడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కారణమనే చర్చ సైతం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: