ఇకపోతే ఎన్నికల సమయంలో ఈ వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం ఎన్నికల్లో తమ పరిస్థితి ఏంటి అని.. ప్రస్తుతం మంత్రులను అడుగుతున్నారు.. ఈ నేపథ్యంలోనే తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని టిడిపి మంత్రులను వేడుకుంటున్నారు వాలంటీర్లు. దీంతో ఆగ్రహం చెందిన మంత్రులు... మిమ్మల్ని ఎవరు రాజీనామా చేయమన్నారు? ముందుగా వారిపై కేసు పెట్టి రండి అప్పుడు చూద్దాం అంటూ మంత్రి అచ్చెం నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వచ్చిన వాలంటరీ వ్యవస్థ అలాగే ఉంటుందని టిడిపి స్పష్టం చేసింది.. అంతేకాదు రూ.5,000 ఉన్న జీతం రూ.10,000 కు పెంచుతామని కూడా చెప్పింది. ప్రస్తుతం రాజీనామా చేయని వాలంటీర్లు కూడా ప్రస్తుత తమ పరిస్థితి ఏంటి? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
పైగా 1993 నుంచి 2003 మధ్య వయసున్న వారు డిగ్రీ పూర్తి చేసిన వారు మాత్రమే వాలంటరీ ఉద్యోగానికి అర్హులు అని.. టిడిపి ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు వైసిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వైసిపికి అనుకూలంగా ఉన్న వారికే వాలంటరీగా ఉద్యోగం వచ్చింది. ఈ నేపథ్యంలోనే వారిని ఉంచాలా తీసేయాలా అనే ఆలోచనలో కూడా పడ్డారు. మరి ప్రస్తుతం ఉన్న వాలంటీర్ల పరిస్థితి కూడా ఆగమ్య గోచరంగానే మారింది అని చెప్పవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి