మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణమైన పరాజయం పాలు అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న పార్టీ అంత ఘోరంగా ఓడిపోవడం ఏపీ రాజకీయ చరిత్రలోనే తొలిసారి అని చెప్పాలి. ఏకంగా 175 స్థానాలకు గాను కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించగలిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.  ఆ పార్టీ కంచుకోటలను సైతం బద్దులు కొడుతూ టిడిపి జనసేన బీజేపీ పార్టీల కూటమి విజయ డంకా మోగించింది అని చెప్పాలి.


 దీంతో మొన్నటి వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో అయితే తన పార్టీ ఘోర పరాజయానికి గల కారణమేంటి అనే విషయంపై అటు జగన్ సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయంలో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకుని ఇక ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. కానీ అటు ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ వ్యవహార శైలి అస్సలు మారలేదు అన్నది ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట.


 గతంలో ప్రజల్లో వైసీపీపై నెగెటివిటీ వస్తున్నప్పుడు అదంతా పట్టించుకోకపోవడం కారణంగానే చివరికి జగన్ ఓటమిపాలయ్యారు. సాధారణంగా ప్రతిపక్షం అధికారపక్షం కలిసి ఏకంగా అసెంబ్లీ స్పీకర్ కు గౌరవం ఇస్తూ ఆయనను సీట్లోకి ఆహ్వానిస్తూ ఉంటారు. కానీ ఈ కార్యక్రమానికి అటు ప్రతిపక్ష నేతక్క ఉన్న జగన్ మాత్రం వెళ్లలేదు. దీంతో ప్రజాస్వామ్యాన్ని ఆయన అపహస్యం చేసినట్లే అయింది. ఇంకోవైపు ఏకంగా వైసిపి ఆఫీస్ అక్రమ కట్టడం అంటూ ప్రభుత్వం కూల్చేస్తుంటే కనీసం ఏకంగా జగన్ ఆ విషయం పైన స్పందించలేదు. ఇప్పటికీ కూడా పార్టీలోని కీలక నేతలతో అన్ని పనులు పూర్తి చేయాలనుకుంటున్న జగన్ స్వయంగా ఏ పనిని చేయాలని అనుకోవట్లేదని ఆయన వ్యవహార శైలి చూస్తే అర్థమవుతుంది. జగన్ ఇప్పటికైనా తన తీరు  మార్చుకోకపోతే ఇక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మరో దారి చూసుకునే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: