- రు. 25 వేల కోట్లు ఇస్తేనే అమ‌రావ‌తికి ఓ రూపు రేఖ‌లు
- జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో రు. 15 వేల కోట్లు అడిగిన ఆర్థిక మంత్రి ప‌య్యావుల‌

( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ )

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతామ‌ని సీఎం చంద్ర‌బాబు అసెంబ్లీలోనే చెప్పారు. తాజాగా స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడిని ఎన్నుకుని.. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భు త్వ ల‌క్ష్యాల‌ను చంద్ర‌బాబు వెల్ల‌డించారు. వీటిలో అమ‌రావ‌తిని ఆయ‌న హైలెట్ చేశారు. అయితే.. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టుకు రూ.ల‌క్ష కోట్లు కావాల‌ని.. ఈ మేర‌కు నిధులు స‌మీక‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తామ ని.. మంత్రి నారాయ‌ణ తొలి రోజే చెప్పారు.


అయితే.. ఇంత నిధుల‌ను కూడా.. తాము స‌మీక‌రించ‌డం క‌ష్ట‌మవుతున్న నేప‌థ్యంలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమ‌రావ‌తిని తీర్చిదిద్దుతామ‌న్నారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ముందు కొంత మేర‌కు ప‌నులు చేసేందుకు ఇప్ప‌టికిప్పుడు 25 వేల కోట్ల వ‌ర‌కు ప్రాజెక్టుకు అవ‌స‌రం. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఆర్థిక మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ .. రాష్ట్రానికి ముఖ్యంగా రాజ‌ధానికి రూ.15 వేల కోట్లు ఇవ్వాల‌ని కేంద్రాన్ని కోరారు. జీఎస్టీ కౌన్సిల్ స‌మావేశానికి హాజ‌రైన ఆయ‌న ఈ విష‌యాన్ని ప్ర‌తిపాదించారు.


అయితే.. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌నుంచి ఎలాంటి హామీ ద‌క్క‌లేదు. ఈ నేప‌థ్యం లో క‌నీసం 15 వేల కోట్ల రూపాయ‌లైనా ద‌క్కించుకునే ప్ర‌య‌త్నం చేస్తే.. మంచిది. అయితే..ఇక్క‌డ కేంద్రం 2014 నాటి విభ‌జ‌న చ‌ట్టం గురించి ప్ర‌స్తావించే అవ‌కాశం మెండుగా ఉంది. కానీ, అప్ప‌టికి ఇప్ప‌టికి అన్ని రేట్లు మారిపోయాయి. కాంట్రాక్టు సంస్థ‌ల నుంచి ముడి స‌రుకు వ‌ర‌కు అన్ని ధ‌ర‌లు పెరిగిన నేప‌థ్యంలో ఈ చ‌ట్టాన్నిరివైజ్ చేయించాలి.


ఇది సాధ్యం అవుతుందా? అంటే.. రాజ్యాంగంలోనే స‌వ‌ర‌ణ‌లు చేస్తున్న నేప‌థ్యంలో విభ‌జ‌న చ‌ట్టంలోనూ .. స‌వ‌ర‌ణ‌లు చేయ‌డం పెద్ద‌ప‌ని కాదు. కానీ, దీనికి కేంద్రాన్ని ఒప్పించాలి. ఈ క్ర‌తువును తొలి రోజు నుంచి ముందుకు తీసుకువెళ్తే.. ప్ర‌యోజ‌నం ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అలా కాకుండా.. నాన్చివేత ధోర‌ణిని అవ‌లంభిస్తే.. రూ.15 వేలకోట్లు ఇచ్చినా.. అంత‌టితో ప‌నులు అయితే.. ముందుకు సాగే ప‌రిస్థితి లేదు. ఇప్పుడు కేంద్రంలో బ‌లంగా ఉన్న టీడీపీ రాజ‌ధానినిన సాధించుకునే అవ‌కాశం అయితే.. మెండుగానే ఉంద‌ని చెప్పుకోవ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: