ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు వరదల గురించి వింటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఏపీలో విజయవాడకు చెందిన వాళ్లను తెలంగాణలో ఖమ్మంకు చెందిన ప్రజలను వరదలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ అనే పేరు ప్రతి తెలుగు హృదయానికి ఒక పరవశం కాగా నటుడిగా, పొలిటికల్ లీడర్ గా ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.
1977 సంవత్సరం నవంబర్ నెల 19వ తేదీన దివిసీమ ఉప్పెన తెలుగు నేలపై కనీవిని ఎరుగని విషాదాన్ని నింపింది. సీనియర్ ఎన్టీఆర్ ను తీవ్రంగా కదిలించడంతో పాటు పేదల కొరకు ఏదైనా చేయాలని తపించే ప్రకృతి ప్రకోపం ఇది. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ ఇతర కళాకారులతో కలిసి జోలె పట్టి ఏకంగా 15 లక్షల రూపాయల నిధులను రామకృష్ణ మిషన్ ద్వారా బాధితులకు అందజేయడం జరిగింది.
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందే ఈ విధంగా జోలె పట్టి తన మంచి మనస్సును చాటుకోవడం జరిగింది. 1982 సంవత్సరం మార్చి నెల 21వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటన చేశారు. 1982 సంవత్సరం మార్చి నెల 29వ తేదీన సీనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ గురించి ప్రకటన చేయడం జరిగింది. దివిసీమ ఉప్పెన సమయంలో ఎన్టీఆర్ పడిన కష్టాన్ని తెలుగు ప్రజలు సులువుగా మరవలేరు.
సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో కూడా పేద ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించి తన మనస్సును చాటుకున్నారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజల్లో స్పూర్తి నింపాయి. 1996 సంవత్సరం జనవరి 18వ తేదీన మృతి చెందే వరకు ఆయన ప్రజల శ్రేయస్సు లక్ష్యంగా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. సీనియర్ ఎన్టీఆర్ లాంటి మంచి ముఖ్యమంత్రులు చాలా తక్కువమంది ఉంటారని చెప్పవచ్చు.