2023 సంవత్సరం ఇదే సమయానికి ఈ అప్పు ఏకంగా 155 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తోంది. గత పదేళ్లలోనే దేశ అప్పు భారీ స్థాయిలో పెరిగిందని నివేదికల ద్వారా వెల్లడవుతోంది. కాంగ్రెస్ సైతం పలు సందర్భాల్లో అప్పుల విషయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మన దేశ అప్పులు ఇప్పట్లో తగ్గే పరిస్థితులు సైతం కనిపించడం లేదు.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం పెరిగిన అప్పులను జీడీపీ ఆధారంగా చూడాలని వెల్లడించడం కొసమెరుపు. ద్రవ్యలోటును ప్రమాణంగా తీసుకోవడం ద్వారా ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉందో అంచనా వేయొచ్చని చెబుతోంది. మోదీ సర్కార్ కు 2014, 2019 ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చినా ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం బీజేపీకి ఒకింత షాకిచ్చే విధంగానే ఉండటం గమనారం.
2029 ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందో లేదో చెప్పలేము. దేశం వేగంగానే అభివృద్ధి చెందుతున్నా ఖర్చులు సైతం అదే స్థాయిలో పెరుగుతున్నాయనే కామెంట్లు సైతం వినిపిస్తున్నాయి. ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన దేశం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో అయినా దేశం అప్పులు తగ్గితే బాగుంటుందని చెప్పవచ్చు. భారతదేశం అప్పుల విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.