వేద విద్య చదివి ఉద్యోగం లేని యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందించేలా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం హామీ ఇవ్వగా ఆ హామీ అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. వేద విద్య చదివినా ఉద్యోగం సాధించని వ్యక్తుల వివరాలను సేకరించాలని దేవాదాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వేద విద్య చదివిన విద్యార్థులకు ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి.
అయితే ఈ నిరుద్యోగ భృతిని పొందే వాళ్లు తాము ఎక్కడా ఉద్యోగం చేయడం లేదని స్వీయ హామీ పత్రాన్ని సైతం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు సైతం నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కూటమి ఘన విజయానికి ఈ హామీ సైతం కారణమని చెప్పవచ్చు. 2014లో సైతం నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి ఏపీ ప్రభుత్వం చివరి ఆరు నెలలు మాత్రమే అమలు చేసింది.
అయితే పథకాల అమలు ఆలస్యం కావడం వల్ల నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ ఏ విధంగా ముందుకెళ్తుందనే చర్చ సైతం జరుగుతుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రతి పథకాన్ని వేగంగా అమలు చేస్తే మాత్రం కూటమికి ఎంతో బెనిఫిట్ కలుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. చంద్రబాబు రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.