కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో రాష్ట్రానికి మెరుగ్గానే నిధుల కేటాయింపు జరుగుతోంది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను భారీగా పెంచి అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేయడంలో సక్సెస్ సాధించారు. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే వేతనాలను జమ చేయడం జరిగింది.
కూటమి సర్కార్ అన్న క్యాంటీన్లను పునః ప్రారంభించడం వల్ల రాష్ట్రంలో ఆకలితో అలమటించే వాళ్ల సంఖ్య సైతం అంతకంతకూ తగ్గుతోంది. బెజవాడ వరద బాధితులకు ప్రభుత్వం ఆసరాగా నిలవడంతో పాటు ప్రభుత్వం తమ వంతు సాయం ప్రకటించింది. నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడంతో పాటు వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం అందేలా చర్యలు చేపట్టింది.
చంద్రబాబు నాయుడు ఈ 100 రోజుల్లో చేపట్టిన పనులలో మెజారిటీ పనులు ప్రజల మెప్పు పొందాయి. కొన్ని పథకాల అమలు ఆలస్యం కావడం వాస్తవమే అయినా సరైన సమయంలో సరైన పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తన విజన్ తో రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో సైతం అభివృద్ధి పథంలో నడిపించడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబుకు పూర్తిస్థాయిలో సపోర్ట్ అందిస్తున్నారు. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తన వంతు సహాయసహకారాలు అందిస్తూ ఆయన సక్సెస్ కు పరోక్షంగా కారణమవుతున్నారు. బాబు, పవన్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.