ఏంటి బిగ్ బాస్ శివ జ్యోతి సూసైడ్ చేసుకుందా.. నిద్ర మాత్రలు మింగాల్సిన అవసరం ఆమెకు ఎందుకు వచ్చింది..ఎంతో పేరు పాపులారిటీ సంపాదించిన శివ జ్యోతి ఇలా సడన్ గా నిద్ర మాత్రలు మింగి ఎందుకు సూసైడ్ చేసుకుంది.. అసలు శివ జ్యోతి సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణం ఏంటి అని ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. మరి ఇంతకీ శివజ్యోతి నిద్ర మాత్రలు మింగి ఎందుకు సూసైడ్ చేసుకోవాలి అనుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. స్లీపింగ్ పిల్స్ వేసుకొని శివ జ్యోతి సూసైడ్ చేసుకుంది నిజమే.. కానీ ఇప్పుడైతే కాదు.గతంలో ఆమె యాంకర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకముందే.ఇక అసలు విషయం ఏమిటంటే..యాంకర్ శివ జ్యోతి యాంకరింగ్ రంగంలోకి రాకముందు నుండే గంగూలీని ప్రేమించింది. అయితే గంగూలీతో ప్రేమ విషయం ఇంట్లో వారికి అస్సలు ఇష్టం లేదు.


 దాంతో ఇద్దరినీ కొట్టి శివ జ్యోతిని ఊరు నుండి చుట్టాల ఇంట్లో ఉంచి చదివించారట. ఆ తర్వాత కొద్ది రోజులకు సొంతూరికి వచ్చిన శివ జ్యోతి గంగూలీని మర్చిపోలేక ఇంట్లో వాళ్లకి ఆయన్నే చేసుకుంటానని తెగేసి చెప్పిందట. అయితే ఆమె మాటలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడంతో భయపడిపోయిన శివ జ్యోతి గంగూలీ ని ఏమైనా చేస్తారు కావచ్చు అని నిద్ర మాత్రలు మింగి చనిపోవాలనుకుందట.అప్పటికే నిద్ర మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి చేరుకోవడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడంతో బతికిందట.లేకపోతే శివ జ్యోతి ఆరోజే ప్రాణాలు వదిలేదట. ఆ తర్వాత శివజ్యోతి  పై చదువుల కోసం ఇంటి నుండి వెళ్లిపోయింది.

ఇక అలా హైదరాబాదులో శివ జ్యోతి ఆయన సోదరుడు, గంగూలీ ముగ్గురు ఒకే రూమ్ లో కలిసి ఉండేవారు. ఇక గంగూలీ కష్టపడి సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్నాక శివ జ్యోతి కూడా టెలీ కాలర్ గా వర్క్ చేసింది. అలా ఇద్దరు లైఫ్ లో సెట్ అయ్యాక  సాయిబాబా టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లయ్యాక ఎప్పుడైతే యాంకరింగ్ రంగంలోకి శివజ్యోతి అడుగు పెట్టిందో అప్పటినుండి శివజ్యోతి పేరు మర్చిపోయి అందరూ సావిత్రి సావిత్రి అంటూ పిలవడం మొదలు పెట్టారు. అలా సావిత్రిగా ఫేమస్ అయిన శివ జ్యోతి బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించింది.ప్రస్తుతం ఆమె ఆర్థికంగా చాలా బలపడింది.అయితే అలాంటి శివజ్యోతి గురించి గతంలో సూసైడ్ చేసుకున్న మ్యాటర్ మళ్లీ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: