
అయితే లేఖ రాసిన తర్వాత... గులాబీ పార్టీ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు కల్వకుంట్ల కవిత. గులాబీ పార్టీలో కెసిఆర్ చుట్టూ అన్ని దెయ్యాలు ఉన్నాయని బాంబు పేల్చారు. అలాగే తనను పార్టీ లోంచి ఎవరు బయటకు పంపలేరని కూడా తెలిపారు. కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు కల్వకుంట్ల కవిత. అయితే ఇలాంటి నేపథ్యంలో ఆమెపై వేటు పడుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది.
అయితే ఇలాంటి నేపథ్యంలో.... కాంగ్రెస్ పార్టీ టచ్ లోకి కల్వకుంట్ల కవిత వెళ్లినట్లు తెలుస్తోంది. డీకే శివకుమార్ అలాగే వైయస్ షర్మిల ను కల్వకుంట్ల కవిత త్వరలో కలవబోతున్నారట. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో పని కావడం లేదని.... డీకే శివకుమార్ అలాగే వైయస్ షర్మిల తో ప్లాన్ వేసి ఈ కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు వ్యూహ రచనలు చేస్తున్నారట కల్వకుంట్ల కవిత. ఆ ఇద్దరు బడా లీడర్లతో కలిపి.. కాంగ్రెస్ లోకి వెళ్తే... తనకు కీలక పదవి వస్తుందని కల్వకుంట్ల కవిత ఆలోచన చేస్తున్నారట.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు