
అయితే దువ్వాడ ఫ్యామిలీ గోలను భరించలేకపోయిన వైసీపీ.. శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయినా సరే ఆయనకు ఏ చింత లేదు. పైగా పార్టీ వేటు వేశాక మరింత ఫ్రీగా, హుషారుగా మాధురితో లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎవరేమనుకున్నా సరే వి డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మాధురితో దువ్వాడ శ్రీనివాస్ డ్యూయెట్ వేసుకున్నారు.
దివ్వెల మాధురి పెద్ద కుమార్తె వాణి హాఫ్ శారీ ఫంక్షన్ లేటెస్ట్ గా శంషాబాద్ శివారులోని ఓ రిసార్ట్ లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ లో ఓ పాత హిందీ సాంగ్ కు మాధురితో కలిసి దువ్వాడ డ్యాన్స్ చేశారు. ఆకుపచ్చ చీరలో ఒంటి నిండా నగలతో మాధురి అందంగా మాస్తాబు అవ్వగా.. దువ్వాడ సూటు బూటు వేసుకుని దసరా బుల్లోడిలా స్టేజ్ ఎక్కారు. మాధురి మంచి డ్యాన్సర్ కావడంతో.. ఆమె సాంగ్‌కు తగ్గట్లుగా స్టెప్పులు వేసింది. అటు దువ్వాడ సైతం మాధురికి ఏమాత్రం తీసిపోని విధంగా డ్యాన్స్ అదరగొట్టారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్, మధురిల డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది. ఇక కామెంట్ సెక్షన్‌లో కామెంట్లు నెక్స్ట్ లెవల్. ఒక్కొక్కరు ఒక్కో విధంగా రియాక్ట్ అవుతున్నారు
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు