
ఏడాది కాలంలో వైసీపీ కొంతమేర పుంజుకుందని రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలలో ప్రస్తుతం వైసీపీకి ఎడ్జ్ ఉందని తెలుస్తోంది. మిగతా జిల్లాలలో మాత్రం కూటమికి తిరుగులేదని ఉత్తరాంధ్ర జిల్లాలలో కూటమి మరింత బలపడిందని సమాచారం. సంక్షేమ పథకాల అమలు జరగలేదని ప్రజలు విమర్శించినా వరుస పథకాల అమలుతో ఈ పరిస్థితి మారిందనే చెప్పాలి.
అయితే కూటమి ఎమ్మెల్యేలలో కొందరు ఎమ్మెల్యేలు అవినీతి, అరాచకాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఇలాంటి నేతల విషయంలో చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఇసుక, మద్యం విషయంలో ప్రముఖ నేతలపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దుకుంటే కూటమికే బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.
ఇప్పటికే చంద్రబాబు నాయుడు దగ్గర ఈ తరహా తప్పులు చేస్తున్న నేతల రిపోర్ట్ ఉందని తెలుస్తోంది. కొందరు నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకున్నా మిగతా నేతలు సైతం మారే ఛాన్స్ అయితే ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో వైసీపీ పుంజుకోవడానికి అవకాశం లేకుండా చంద్రబాబు పాలన సాగిస్తారేమో చూడాలి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు