ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల ముందు రెడ్ బుక్ అన్నది తెగ వైరల్ గా మారింది. కూటమి ప్రభుత్వం గెలిచిన తరువాతే రెడ్ బుక్ పేరు ఎక్కువగా వినిపించింది. వైసీపీ నేతలు కూడా ఈ రెడ్ బుక్కు పైన పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఏపీ అంతా ఈ రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తోందని ఇష్టం వచ్చినట్లుగా అందరిని అరెస్టు చేస్తూ వేధిస్తున్నారనే విధంగా ఫైర్ అయ్యారు. ఇక వైసిపి కూడా అధికారంలోకి వస్తే ఒక బుక్ రాసి అందరి మీద ప్రతి కారం తీర్చుకుంటామనే విధంగా బదులు ఇస్తున్నారు.



ఇదంతా ఇలా ఉండక ఇటీవలే జగన్ పల్నాడు కి వెళ్ళినప్పుడు అక్కడ రప్పా రప్పా పేరుతో ఫ్లెక్సీలు వెలిసాయి. దీంతో ఏపీలో మరొకసారి ఈ విషయం చర్చనీయంశంగా మారింది. జగన్ నోటి వెంట కూడా రప్పా రప్పా అనే డైలాగ్ రావడంతో ఆ మాటలు మరింత హీటెక్కించాయి.. అసలు ఈ రెడ్ బుక్ ఏంటి..రప్పా రప్పా రెండిట్లో ఇప్పుడు ఏది ట్రెండీగా ఉందనే విషయం తెగ వైరల్ గా మారుతున్నది. ఏపీలో రెడ్ బుక్ ని లోకేష్ యువగళం పాదయాత్రలో తీసుకువచ్చారు కానీ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రెడ్ బుక్ బాగానే పాపులర్ అయింది. ఏకంగా నేషనల్ మీడియాకి సైతం పాకి పోయేలా చేశారు.



కానీ ఇప్పుడు రప్పా రప్పా అనే పాయింట్ ఏపీ పాలిటిక్స్ లోనే సరికొత్త విధంగా వినిపిస్తున్నది. ఐదేళ్లపాటు సీఎంగా పనిచేసిన నాయకుడు.. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వైయస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత జాతీయస్థాయిలో సరికొత్తగా ట్రెండీగా మారింది రప్పా రప్పా అనే పదం.. పుష్ప 2 చిత్రంలో జాతీయస్థాయిలో వినిపించిన ఈ డైలాగ్ ఇప్పుడు జగన్ నోటి వెంట రావడంతో నేషనల్ మీడియా కూడా ఈ విషయం పైన ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఏపీ రాజకీయాలలోని రప్పా రప్పా అనే పదం మరొకసారి రాజకీయ వేడిగా మారిపోయింది. దీంతో తెలంగాణలో కూడా అక్కడక్కడ ఇందుకు సంబంధించి ఫ్లెక్సీలు కూడా వేలుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: