
సింగయ్య భార్య చేసిన కామెంట్ల గురించి పోలీసులు, ఏపీ సర్కార్ ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది. జగన్ గురించి ప్రజల్లో నెగిటివ్ చేయడానికే ఈ తరహా ప్రచారం చేశారంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ విషయంలో కుట్రలు జరుగుతున్నాయని అభిమానులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
జగన్ కు సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచే ఏ అవకాశాన్ని కూడా కూటమి సర్కార్ అయితే వదులుకోవడం లేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సింగయ్య కుటుంబానికి వైసీపీ 10లక్షల రూపాయల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
చిన్నచిన్న గాయాలకే భర్త చనిపోవడం తాను నమ్మలేకపోతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వం వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చిందని కామెంట్లు చేశారు. తమ కుటుంబానికి జగన్ అంటే అభిమానమని ఆమె కామెంట్లు చేశారు. జగన్ పై నిందలు వేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు