మాజీ సీఎం వైఎస్ జగన్ చిత్తూరు పర్యటన గురించి ప్రజల్లో జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. జగన్ మామిడి రైతులను కలవడానికి వెళ్తున్న నేపథ్యంలో నాలుగు రోజుల నుంచి సిస్టమాటిక్ గా రాష్ట్ర ప్రభుత్వం వాళ్లకు ఎంతిస్తుంది? ఏయే రోజుల్లో ఎన్ని టన్నుల మామిడిని కొనుగోలు చేశారు? సంస్థలు ఎంత ఇస్తున్నాయి? అనే విషయాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం జరుగుతోంది.

ఈ విధంగా చేయడం వల్ల  రైతులకు ఏ స్థాయిలో ప్రయోజనం కలుగుతుందో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.  జగన్  వల్ల రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  కూటమి సర్కార్ అచ్చెన్నాయుడును  ఢిల్లీకి పంపించి మామిడికి గిట్టుబాటు ధర  కల్పించే దిశగా సైతం  అడుగులు పడటం హాట్ టాపిక్ అవుతోంది.

జగన్ వల్ల  మామిడి రైతుల కష్టాలు  దాదాపుగా తీరినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  జగన్ కు ప్రజల్లో మద్దతు పెరగకుండా  కూటమి  సర్కార్ ఒకింత తెలివిగా వ్యవహరిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.  అయితే  వైసీపీ మాత్రం ఏపీ రైతులకు ఆశించిన స్థాయిలో రేట్లు అయితే  దక్కడం లేదని  కూడా కామెంట్లు  వినిపిస్తూ ఉండటం గమనార్హం.

జగన్ ను  నెటిజన్లు సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు. జగన్ ఏ సమస్యపై దృష్టి పెడితే ఆ  సమస్య వేగంగా  పరిష్కారం  అవుతోందని  కామెంట్లు వినిపిస్తున్నాయి.  జగన్ చిత్తూరు పర్యటనకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.  జగన్   భవిష్యత్తులో సైతం  ఇదే విధంగా అడుగులు వేయాల్సిన అవసరం అయితే ఉందని  కామెంట్లు  వ్యక్తమవుతూ  ఉండటం గమనార్హం.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: