తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి పంపకాల వివాదం ఢిల్లీ వేదికగా కీలక మలుపు తీసుకుంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జర‌గ‌బోయే సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీ అజెండాలో మొదటి అంశంగా ఉన్నది – పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు. ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ను తమ రాష్ట్రానికి కీలకమని పేర్కొంటూ ప్రధానంగా చర్చించాలంటూ కోరింది . అటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, మొత్తం తొమ్మిది అంశాలతో కూడిన ప్రత్యేక్క అజెండాను కేంద్రానికి సమర్పించింది .
 

ఇక ఈ అంశాలలో నీటి పంపకాల పై సమీక్ష, పునరాలోచన, ప్రస్తుత ప్రాజెక్టుల పరిపాలనలో మార్పులు వంటి కీలక విషయాలు ఉన్నాయి. వాటిని కూడా కేంద్రం చర్చించాల్సిన అంశాలుగా అంగీకరించింది. దీంతో కేంద్రం మొత్తం 10 అంశాలతో కూడిన సమావేశ అజెండాను సిద్ధం చేసింది. అందులో తొలి అంశంగా బనకచర్ల ప్రాజెక్టును ఉంచిన విధానం, ఏపీకి కొంత వరకు మద్దతుగా భావించబడుతోంది . ఏపీ తరఫున సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై సుదీర్ఘ సమీక్షలు జరిపారు. గతంలో ఉమా భారతి హయాంలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ భేటీ, జగన్ హయాంలో జరిగిన రెండో సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ పునఃపరిశీలించారు .

 

అలాగే గోదావరి బోర్డు , పోలవరం ప్రాజెక్టు అథారిటీ , కేంద్ర పర్యావరణ శాఖల నివేదికలు , నిపుణుల అభిప్రాయాలను కూడా చంద్రబాబు పరిశీలించినట్టు సమాచారం . తెలంగాణ ప్రభుత్వం మాత్రం బనకచర్ల ప్రాజెక్టు పై గతంలో పంపిన లేఖలోని అభ్యంతరాలను ముందుకు తెస్తోంది. వారి వాదన ప్రకారం, కేంద్ర సంస్థలు ఇప్పటికే కొన్ని వ్యతిరేక అభిప్రాయాలు తెలిపిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు చర్చకు అర్హమైందేనా అన్నదానిపై స్పష్టత అవసరం. ఈ భేటీతో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై ఓ స్పష్టమైన దిశ ఏర్పడుతుందా ? లేక మరో కొత్త వివాదానికి తెరలేపుతుందా ? అన్నది తేలాల్సి ఉంది. కానీ బనకచర్ల వ్యవహారం ఈసారి రెండు రాష్ట్రాల మధ్య తాజా రాజకీయ టెంపరేచర్‌ను భారీగా పెంచేసింద రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: