
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే మాగంటి గోపీనాథ్ మృతి చెందడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. బిజెపికి రాజీనామా చేసిన రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుందని అంటున్నారు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే మరో అసెంబ్లీ స్థానానికి సైతం జరగబోతుందని వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేగా ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర ఎమ్మెల్యేలు తమ పార్టీ ఫిరాయించ లేదని వాదిస్తున్నారు. దానిని బిఆర్ఎస్ నిరూపించలేదు. కానీ దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కాబట్టి ఆయన రాజీనామా చేయిక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
ఇప్పుడు రాజకీయాలు కూడా కలిసి వస్తున్నాయి. తాను ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా రాజీనామా చేయడం ద్వారా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి మంత్రి పదవి టార్గెట్గా పెట్టుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది .. దాంతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక జరిగేలా చూసుకొని రెండు స్థానాల బాధ్యతలను తీసుకుని రెండిటిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్ కాంగ్రెస్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల వరకు సైలెంట్ గా ఉన్న దానం ఇప్పుడు మళ్లీ బి ఆర్ ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ రెండు స్థానాల్లో దానం బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత అడ్వాంటేజ్ అవుతుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి దానం ఈ పరీక్షలో ఎంతవరకు గెలిచి గెలుస్తారో చూడాలి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు