ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఆ పార్టీ నేతలు వేర్వేరు సందర్భాల్లో చేసిన బూతు కామెంట్లు కూడా ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం కూటమి సర్కార్ అధికారంలో ఉండగా టీడీపీ నేతలు మాత్రం తెలివిగా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మద్యం కుంభకోణంలో అసలు దోషి జగన్ అని అంతిమంగా లబ్ది పొందింది జగన్ మాత్రమేననే కామెంట్లు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

అయితే టీడీపీ నేతలు జగన్ పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయకుండా  తెలివిగా వ్యవహరిస్తున్నారు.  ఏ మాత్రం దుర్భాషలు, అడ్డగోలు వాదనలు లేకుండా జగన్, వైసీపీ నేతలు చేసిన తప్పులు ఇవేనంటూ  కూటమి మంత్రులు విమర్శలు చేస్తూ ప్రజల ప్రశంసలు పొందుతున్నారు.  పామరులకు సైతం ఈ కుంభకోణం ఎలా జరిగిందో అర్థమయ్యేలా చెబుతూ ఉండటం కూటమి నేతలకు  ఎంతగానో ప్లస్
అవుతుంది.

బాధ్యతాయుతంగా, తెలివిగా విమర్శలు చేయడం ద్వారా వైసీపీకి కౌంటర్ ఇచ్చే అవకాశం కూడా లేకుండా చేయడంలో  సక్సెస్ అవుతున్నారు. భవిష్యత్తులో సైతం ఈ నేతలు ఇదే విధంగా ముందుకెళ్తే బాగుంటుందని ఏపీ ప్రజలు అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.  జగన్ మంచి వ్యక్తి  కాదని మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని  కామెంట్లు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు నాయుడు చేసిన దిశానిర్దేశం వల్ల  మంత్రులు సైతం అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  కూటమి నేతలు  ఈ విధంగా చేయడం వల్ల మేధావులు, విశ్లేషకులు సైతం విమర్శలకు తావివ్వకుండా  చేయడం సరైన నిర్ణయం అని నెటిజన్లు  అభిప్రాయపడుతున్నారు.  చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో జగన్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: