
ఎయిర్ ఫోర్స్ వన్ నుంచే వార్నింగ్! .. అమెరికా అధ్యక్షుడు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడుతూ – భారత్‌పై సుంకాలు విధించడం తప్పదని, 20% నుంచి 25% వరకూ టారిఫ్ విధించే అవకాశముందని తెలిపారు. అంతేకాదు, తాను పదవిలో ఉన్నంతకాలం టారిఫ్ పాలసీ కంటిన్యూ అవుతుందన్న స్పష్టత కూడా ఇచ్చారు. భారత్ నుండి ఎక్కువ సుంకాలు వసూలవుతున్నాయా? .. అమెరికా అఫీషియల్ గణాంకాల ప్రకారం, భారత్ కొన్ని కీలక ఉత్పత్తులపై అమెరికా కంపెనీలకు పెద్దస్థాయిలో సుంకాలు విధిస్తోందని వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ ఇప్పుడు ముందుకు తెస్తున్నారు. కానీ భారత్ ఇంకా ఈ అంశంపై ఆఫీషియల్‌గా స్పందించలేదు.
భారత వైఖరి: నెగోషియేషన్ మోడ్ .. ఇక కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ – “భారత్ ఎంతో ఆత్మవిశ్వాసంతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. తగిన నిర్ణయాలు తీసుకుంటాం. ఈ చర్చలు ద్వైపాక్షిక బలమైన ఒప్పందానికి దారితీస్తాయని నమ్మకంగా ఉంది” అన్నారు. విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా ఇదే టోన్‌లో స్పందించారు. ఫైనల్ గా చెప్పాలంటే… వాణిజ్యంలో నువ్వా నేనా యుద్ధం మొదలైపోయింది. ట్రంప్ గేమ్ ఓపెన్ చేశాడు. ఇప్పుడు మోదీ టీం ఎంత ధీర్ఘ దృష్టితో తడపకుండా డీల్ చేస్తుందో చూడాలి. లేకపోతే టారిఫ్ భారంతో ఇండియన్ మార్కెట్లపై భారం పడడం ఖాయం!