
పాలనలో ఇచ్చిన హామీలపై అసంతృప్తితో పాటు, స్థానిక స్థాయిలో నాయకత్వాన్ని నిర్లక్ష్యం చేయడం వంటివి వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. దీంతో గత ఎన్నికల్లో రెడ్డి వర్గం ఓ భాగం టీడీపీకి జైకొట్టినట్టు స్పష్టమైంది. ఇంతలో మిథున్ రెడ్డి అరెస్టు విషయం రెడ్డి వర్గానికి సెంటిమెంట్‌గా మలచాలని పెద్దిరెడ్డి ప్రయత్నించారు. రాజకీయ కుట్ర, కుటుంబంపై దాడి, రెడ్డి వర్గాన్ని టార్గెట్ చేస్తోంది ప్రభుత్వం అన్న మాటా పెట్టి విమర్శలు గుప్పించారు. కానీ ఈ ప్రయోగం తిరస్కరణ ఎదుర్కొంది.ఎందుకంటే ప్రజల చుట్టూ ఉన్న వాస్తవాలు వేరేలా ఉన్నాయి. మద్యం కుంభకోణంలో ప్రమేయం, సిట్ ఆధారాలు, విచారణలో మిథున్ పాత్ర స్పష్టమవుతుండటం వంటివి ప్రజలను సింపతీకి దూరంగా ఉంచాయి.
పైగా, పెద్దిరెడ్డి కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు తమ సమస్యలపై స్పందించలేదు అనే ఆవేదన కూడా రెడ్డి వర్గంలో గట్టిగా ఉంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి చేసిన ఐక్యత పిలుపు ఫలించలేదు. మిథున్ అరెస్టు విషయంలో వర్గీయంగా కలిసిరావడం అనవసరం, ఇది వ్యక్తిగతంగా ఎదుర్కోవాల్సిన అంశం అన్న అభిప్రాయం రెడ్లలో వ్యాప్తి చెందింది. అంతే కాక, ఈ కుట్ర, బాధితుడిగా మలచే యత్నం సూటిగా విఫలమైంది. ఇక రెడ్డి వర్గం వైసీపీకి దూరమవడమే కాక, సింపతీ కూడా లేకపోవడం అంటే అది పార్టీకి భవిష్యత్ లో పెద్ద మైనస్ అవుతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దిరెడ్డి ప్లాన్ – ఫెయిల్యూర్. రెడ్ల హృదయాలు – దూరం. వైసీపీకి ఇది ఒక హెచ్చరికే!