1996 నుంచే జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు కీలక ఆటగాడిగా గుర్తింపు పొందారు. అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో బీజేపీని దూరంగా ఉంచడం, కాంగ్రెస్‌ ను కంట్రోల్ చేయడం - ఇవన్నీ బాబులో ఉన్న రాజకీయ వ్యూహశక్తికి ఉదాహరణలే. వాజ్‌పేయి తొలి ప్రభుత్వం కేవలం ఒక్క ఓటుతో పడిపోయిన తర్వాత 1999లో ఎన్డీయేకి మద్దతు ఇచ్చి అయిదేళ్ళ పాటు బలంగా నిలిపాడు. అప్పుడే కేంద్రంలో బీజేపీకి బలం లేకపోయినా, బాబు మద్దతుతో గద్దె కాపాడగలిగారు. ఇప్పుడు అదే దృశ్యం మరోసారి 2024లో పునరావృతమైంది. బీజేపీకి మెజారిటీ రాకపోయినా, చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మద్దతుతో మూడోసారి మోడీ ప్రధాని అయ్యారు.


 "మోడీ-బాబు జోడీ" మళ్లీ సక్సెస్ అయింది. టీడీపీ మద్దతు లేకుంటే ఎన్డీయే దారిలో ముందుకు సాగటం కష్టం. ఇదే కారణంగా ఇప్పుడు బాబు పాత్ర కేంద్ర రాజకీయం లో అసాధారణంగా కీలకంగా మారింది. ఇక ఇటీవలి ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి. మోహన్ భగవత్ చెప్పిన “75 ఏళ్లు వచ్చినవారు తప్పుకోవాలి” అన్న వ్యాఖ్యలు నేరుగా మోడీని లక్ష్యంగా చేసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చెబుతున్నారు. ఇక మోడీ తరువాత ఎవరు అన్నదానిపై చర్చలు మొదలయ్యాయి. నితిన్ గడ్కరీ పేరు ఈ రేసులో ముందు వరుసలో ఉంది. ఆయన తాజా ఎపి పర్యటనలో చంద్రబాబును ప్రశంసించిన తీరు కూడా మదిలో పెట్టుకోవాల్సిందే.



గడ్కరీ, చంద్రబాబు మధ్య పెరిగిన దగ్గరదనం, నితీష్ కుమార్‌తో ఉన్న స్నేహం - ఇదంతా ఏదో పెద్ద విషయాన్ని సూచిస్తుంది ..  మిత్రపక్షాల మద్దతు లేకుండా బీజేపీకి భవిష్యత్తు లేదన్న విషయం ఎన్‌డీయేలో అందరికీ స్పష్టమవుతోంది. ఇటువంటి సమయాల్లో చంద్రబాబు వంటి వ్యూహవేత్త ఉండడం ఎన్డీయేకి బలంగా మారుతోంది. ఏది ఏమైనా, మోడీ తరువాత బీజేపీ – ఎన్డీయేలో కీలకంగా ఎవరు మారతారన్న దానిపై స్పష్టత రానప్పటికీ, ఆ సమీకరణాల్లో బాబు పాత్ర తేలికపాటి కాదు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు మ‌రోసారి కింగ్ మేకరాగా  ఉండాబోతున్న‌రు గానీ, ఆయన్ను బయటకు తీస్తే ఆట మొత్తం మారిపోతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: