జమ్మలమడుగు వైసిపి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసులో భాగంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎర్రగుంట్ల పోలీస్ స్టేషన్లో ఉంచగా ఆ సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పోలీసుల విధులకు ఆటంకం కలిగించినారని.. అలాగే పోలీసుల పైన దుర్భాషలాడిన కేసులో భాగంగా సుధీర్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు తెలియజేశారు.


వైసిపి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటుగా మరో 30 మంది పైన ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ అంశం పైన జమ్మలమడుగు డిఎస్పి వెంకటేశ్వర్లు స్పందిస్తూ.. వైయస్ అవినాష్ రెడ్డిని పులివెందులలో అరెస్టు చేశామని ఆ సమయంలో కొంతమంది పోలీసులను అడ్డుకొని విధులకు ఆటంకం కలిగించారంటూ తెలిపారు. ఎర్రగుంట్ల సర్కిల్ లో పోలీసు వాహనాలను సైతం అడ్డుకున్నారని అవినాష్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తన ఇంటికి తీసుకువెళ్లారని.. అలాగే నాలుగు రోడ్ల కూడలిలో ధర్నా చేపట్టారని తెలిపారు.


పోలీస్ కస్టడీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి తప్పించడానికి సహాయపడిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రయత్నంలో భాగమయ్యారని..ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే అవినాష్ రెడ్డిని బలవంతంగా తన ఇంటికి తీసుకువెళ్లారని ఈ ఘటన పైన పోలీస్ కేసు నమోదు అయ్యిందని స్పష్టం చేశారు. అందుకే విచారణ కోసమే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు డిఎస్పి వెంకటేశ్వర్లు. ఇక ఈ కేసులో ఇప్పటికే చాలామందిని కూడా వివరించాలని తెలియజేశారు. పులివెందల, ఒంటిమిట్ట ప్రాంతాలలో జరిగిన జడ్పిటిసి ఉపఎన్నికలలో సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. ఎన్నికలను రద్దుచేసి తిరిగి ఎన్నికలు జరపాలని కోరినప్పటికీ ఈ రోజున ఎన్నికల ఫలితాలు తేలబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: