
ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన లాయర్ పరమానంద గుప్తా ఒక ఎస్సీ అమ్మాయిని అడ్డం పెట్టుకొని అనేక మంది మీద అనేక ఫేక్ కేసులు పెట్టాడు అని తాజాగా తేలింది. ఉత్తరప్రదేశ్ కు సంబంధించిన లాయర్ పరమానంద గుప్త ఎస్సి అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఎవరితోనైనా ఆమె గొడవలు పెట్టే విధంగా చూసి , గొడవ అయ్యాక ఆమెను కులం పేరుతో దూషించారు అని చెప్పి లాయర్ స్వయంగా ఆమెను పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లి కేసులు పెట్టించడం , ఆ తర్వాత ఈయన దగ్గరుండి సెటిల్మెంట్ చేయడం , అలాగే ఏదైనా వ్యాపార విషయాల్లో కూడా ఈమె కలగజేసుకొని సెటిల్మెంట్లు చేయడం , అక్కడ ఏదైనా తేడా కొడితే కులం పేరుతో దూషించారు అని కేసు పెట్టడం , దాన్ని కూడా లాయర్ స్వయంగా సెటిల్ చేయడం జరుగుతూ వచ్చినట్లు , ఇవి తాజాగా కోర్టుకి తెలిసింది. దానితో ఈయన ఏమేమి చేశాడు అనే నివేదికను పూర్తిగా బయటకు తీయమని కోర్టు సూచించింది.