
ఈ పెట్టుబడులు నాస్‌డాక్ స్టాక్ మార్కెట్‌లో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల జాబితాలో రైడెన్‌కు సహాయపడతాయని సంస్థ ప్రభుత్వానికి తెలిపింది. ఈ ప్రతిపాదనలు ఉన్నతస్థాయి అధికారుల బృందంతో చర్చలు జరుగుతున్నాయి. ప్రోత్సాహకాలు, ఇతర అంశాలపై స్పష్టత రావడంతో పాటు, అనుమతులు త్వరలో లభించే అవకాశం ఉంది. ఈ డేటా సెంటర్ ఆసియాలోనే అతిపెద్దదిగా మారి, ఆంధ్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుంది.విశాఖ జిల్లాలో మూడు ప్రాంతాల్లో ఈ డేటా సెంటర్లు ఏర్పాటు కావాలని రైడెన్ ప్రస్తావించింది.
అడవివరంలో 120 ఎకరాలు, తర్లువాడలో 200 ఎకరాలు, రాంబిల్లి అచ్యుతాపురం క్లస్టర్‌లో 160 ఎకరాలు కేటాయించాలని కోరింది. మొత్తం 480 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. అనుమతులు లభించిన వెంటనే నిర్మాణాలు ప్రారంభించి, రెండున్నర సంవత్సరాల్లో మొదటి దశ యూనిట్ పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2026 మార్చిలో నిర్మాణాలు మొదలై, 2028 జులై నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రణాళిక. ఈ డేటా సెంటర్లకు కలిపి 2,100 మెగావాట్ల విద్యుత్ అవసరం ఏర్పడుతుంది. అడవివరంలో 465 మెగావాట్లు, తర్లువాడలో 929 మెగావాట్లు, రాంబిల్లిలో 697 మెగావాట్లు అవసరమని సంస్థ తెలిపింది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు