
వైసీపీ పాలనలో అప్పటి మంత్రి జోగీ రమేష్ ఆధ్వర్యంలోనే ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు నిందితుడు జనార్దన్ రావు వెల్లడించారు. టిడిపి ప్రభుత్వం రాగానే నిఘా పెరగడంతో ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని ఆపివేశామంటూ తెలియజేశారు. ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జోగి రమేష్ తనకు ఫోన్ చేసి మరి మద్యం తయారు చేయాలని చెప్పారని, అయితే ఇదంతా కూడా టిడిపి ప్రభుత్వం పైన బురదజల్లే విధంగా ఉండాలని అందుకే కల్తీ మద్యం మొదలు పెట్టాలని జోగి రమేష్ తనతో చెప్పారని నిందితుడు జనార్ధన్ తెలియజేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి.
వాస్తవంగా మొదట ఈ మద్యం ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాం కానీ జోగి రమేష్ ఆదేశాల మేరకే తంబళ్లపల్లి నియోజకవర్గంలో మొదలుపెట్టామంటూ తెలిపారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో లిక్కర్ షాపులు తానే తీసుకున్నానని, అక్కడి నుంచి ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వంపై బురద జల్లొచ్చు అది మనకి అడ్వాంటేజ్ అవుతుందంటూ జోగి రమేష్ అన్నారని A1 నిందితుడుగా ఉన్న జనార్ధన్ వెల్లడించారు. అందుకే ఇతర పేర్ల మీద రూములు అధ్యక్ష తీసుకొని లిక్కర్ తయారీకి కావాల్సిన యంత్రాలను తీసుకువచ్చామని, సమయం చూసి దానిని ప్రభుత్వం మీద రుద్దుతామని జోగి రమేష్ తనతో చెప్పారంటూ జనార్దన్ వెల్లడించారు. అలా అంతా సిద్ధమైన తర్వాత తనని ఆఫ్రికాలో ఉండే నా ఫ్రెండ్ దగ్గరికి దగ్గరికి పంపించేశారని తెలిపారు. తనకున్న ఇన్ఫర్మేషన్ తో పోలీసులను రప్పించి ఈ వ్యవహారం చేశారంటూ జనార్దన్ రావు తెలిపారు.