
అలాగే కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ రెండవ సీజన్లో పాల్గొనింది. ఒకానొక సమయంలో తమిళ బిగ్ బాస్ హోస్టుగా వ్యవహరించిన కమలహాసన్ ని ఈమె ఎదిరించడంతో సంచలనంగా మారింది. తనని తప్పుగా చిత్రించొద్దు అంటూ డైరెక్ట్ గా ఆయనకే చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అలా అయేషా పేరు వార్తలలో నిలిచింది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఈమె తన లవ్ బ్రేకప్ ,మాజీ ప్రియుడు గురించి కూడా పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు తెలియజేసింది. గతంలో తన తమిళ బిగ్ బాస్ షోలో 65 రోజుల పాటు ఉన్నానని ఆ సమయంలో తన ప్రియుడు బయట వేరే అమ్మాయితో రిలేషన్ మెయింటైన్ చేశారంటూ తెలియజేసింది.
హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో నాగార్జున ఈమెకు గ్రీన్ స్టోన్ ఇచ్చారు. నామినేషన్ లో ఈ పవర్ ఉపయోగించి జరిగే తీరని సైతం మార్చుకోవచ్చు అంటూ తెలియజేశారు. అలాగే హార్ట్ సింబల్ ఇచ్చి హౌస్ లోకి ఎవరికైనా ఇచ్చి , వారికి ఇవ్వడానికి గల కారణాలను కూడా తెలియజేయాలని చెప్పారు. అయితే ఈ హార్ట్ ను ఇమ్మాన్యుయేల్ కు ఇచ్చేసింది అయేషా జీనత్. మరి తెలుగు బిగ్ బాస్ సీజన్ లో తన ఆట తీరుతూ ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి