లాలూ మొదట జనతా పార్టీలో చేరి, తరువాత జనతా దళ్ ద్వారా బీహార్ రాజకీయాల్లో ఎదుగుదల సాధించారు. 1990లో ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో తెర వెనక వ్యూహకర్తగా ఉన్నాడు నితీష్ కుమార్. కానీ ఆ మిత్రత్వంలో చీలిక మొదలైంది లాలూ అధికారంలోకి వచ్చిన తర్వాత. నితీష్ సలహాలను పట్టించుకోకుండా, యాదవ్ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడం నితీష్ వర్గానికి కడుపునొప్పి అయ్యింది. ఆ అసంతృప్తి క్రమంగా రాజకీయ విభేదాలకు దారి తీసింది.
1994లో నితీష్ “కూర్మీ చేతన ర్యాలీ” నిర్వహించి తన సామాజిక వర్గానికి నాయకుడిగా ఎదిగారు. ఆ తరువాత ఆయన జనతా దళ్ (యునైటెడ్) పార్టీని స్థాపించి, బీజేపీతో చేతులు కలిపారు. అటల్ బిహారీ వాజ్‌పేయ్ ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా కీలక పాత్ర పోషించారు. 2005లో బీహార్ సీఎం అయిన నితీష్ అప్పటి నుంచి పాలనలో కొత్త అధ్యాయం ప్రారంభించారు. పారదర్శకత, అభివృద్ధి, విద్య, రహదారుల విషయంలో ఆయన చూపిన కృషితో ప్రజల మన్ననలు పొందారు. మధ్యలో కొద్ది కాలం తప్ప పదే పదే అధికారంలోకి వస్తూ బీహార్‌ను తన కట్టిపడేశాడు.
ఇక లాలూ వైపు చూస్తే, ఆయన తర్వాత రబ్రీదేవి పదేళ్ళ పాటు సీఎం పదవిని అలంకరించారు. కానీ నితీష్ మాత్రం వారిద్దరికంటే ఎక్కువ కాలం పాలించి కొత్త రికార్డు సృష్టించారు. ఇప్పుడు రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కుతోంది. తండ్రి లాలూని ఎదిరించిన నితీష్, ఇప్పుడు కొడుకు తేజస్వి యాదవ్‌తో పోటీ పడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. నితీష్ భవిష్యత్తు ఏమవుతుంది? బీజేపీ మరోసారి ఆయన్ని సీఎం పదవికి మద్దతు ఇస్తుందా? లేదా కొత్త యుగం ప్రారంభమవుతుందా? అన్నదానిపై చర్చ జోరుగా నడుస్తోంది. కానీ ఏదేమైనా — లాలూ, నితీష్ ఇద్దరూ బీహార్ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచే పేర్లు. ఒకప్పుడు “బీహార్ బ్రదర్స్”గా పేరు తెచ్చుకున్న ఈ జోడీని చివరికి రాజకీయమే విడగొట్టింది!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి