బ్యాంకుల 'శక్తి' కేంద్రం: విశ్వసనీయతకు నిదర్శనం! .. ఈ శంకుస్థాపన కేవలం భవన నిర్మాణానికి సంబంధించినది మాత్రమే కాదు. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఆర్థిక కేంద్రంగా మార్చడానికి వేస్తున్న బలమైన పునాది. ఒకేసారి 25 అగ్రశ్రేణి బ్యాంకులు రాజధానిలో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవడం అంటే... జాతీయ ఆర్థిక సంస్థలకు రాజధానిపై ఉన్న విశ్వాసానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా ఆర్‌బీఐ (RBI) రీజినల్ ఆఫీస్ ఏర్పాటుకు అక్టోబర్ 2025లోనే ఒప్పందం కుదరడం... రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలకు ఇది కొత్త ఊపునివ్వనుంది. ఈ బ్యాంకుల ఏర్పాటుతో ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. వేలాది మందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 62 ఎకరాల్లో భారీ ప్రాజెక్ట్: ఏకమవుతున్న సంస్థలు! .. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం సీఆర్‌డీఏ కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తంగా 11 సంస్థలకు 49.5 ఎకరాలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థల అధికారుల నివాసాల కోసం 12.66 ఎకరాలు కేటాయించారు.
ఇక ఇటీవలి CRDA సమావేశాల్లో NABARD, SBI, UBI, bank of Baroda, bank of India, Canara bank, indian bank, Coastal local Area bank వంటి అగ్రగామి బ్యాంకులకు భూములను అధికారికంగా ఆమోదించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ సంస్థలన్నీ ఒకేచోట కొలువుదీరడం... భవిష్యత్తులో అమరావతి భారతదేశ ఆర్థిక శక్తి కేంద్రాల్లో ఒకటిగా మారడానికి మార్గం సుగమం చేస్తుంది. నిజానికి, ఈ శంకుస్థాపన గత నెలలోనే జరగాల్సి ఉన్నా... వాతావరణం అనుకూలించకపోవడం, తుపాను కారణంగా వాయిదా పడింది. ఆలస్యమైనా, అత్యంత పటిష్ఠమైన ఈ చారిత్రక ఘట్టం ఇప్పుడు రాష్ట్రానికి కొత్త ఉత్సాహాన్ని, ఆర్థిక ప్రగతిని అందించేందుకు సిద్ధంగా ఉంది. 'కలక్షన్ కింగ్' లాగా అమరావతి 'ఫైనాన్షియల్ కింగ్ గా మారుతుందని, త్వరలోనే ఇక్కడ భారీ పెట్టుబడులు వస్తాయని ఆశిద్దాం!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి