వచ్చే నెలలో మరో రెండు కొత్త పథకాలను ప్రారంభించడానికి సిద్ధమయ్యింది. మార్చి 8 వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా.. సెర్ఫ్ ఏర్పాటు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటన చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమయ్యింది. ముఖ్యంగా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మి పథకాలు అమలు చేయబోతున్నట్లు సమాచారం. ఈ పథకాలు డ్వాక్రా మహిళా కుటుంబ సభ్యులలో పిల్లల చదువుకు, వివాహాలకు చేయూతనిచ్చేలా ఉంటుంది. ఈ రెండు పథకాలలో భాగంగా శ్రీనిధి బ్యాంకు ద్వారా డ్వాక్రా మహిళలకు లక్ష రూపాయల వరకు పావుల వడ్డీ రుణం అందిస్తారట.
అయితే ఈ రెండు పథకాలకు అర్హత ఉండాలి అంటే డ్వాక్రా సంఘంలో ఉండి కనీసం 6 నెలల పాటు అంతకంటే ఎక్కువ కాలం ఉన్నవారికి మాత్రమే అర్హులు అన్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ లక్ష్మీ కల్యాణ పథకం ద్వారా కుమార్తెల వివాహం కోసం రూ. 10వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. వీటిని 48 వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవాలి అంటే వివాహానికి సంబంధించి పత్రం పెళ్లి ఖర్చు అంచనా సమర్పిస్తే చాలు.
ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకంలో భాగంగా స్కూలు, కాలేజీ ఫీజు కోసం ఈ డబ్బులను వినియోగించుకోవచ్చు. వీటికి కూడా రూ.10వేల నుంచి లక్ష రూపాయల వరకు రుణం. ఈ సొమ్మును 48 వాయిదాలలో చెల్లించాలి. ఈ రుణం పొందాలి అంటే పిల్లల అడ్మిషన్ లెటర్ తో పాటుగా విద్యాసంస్థల వివరాలు అందించాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి