గతంలో చెప్పినట్టుగా వృద్ధాప్య పింఛన్లను మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకు పెంచామని గుర్తు చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆడబిడ్డ నిధి పథకంలో భాగంగా ప్రతి మహిళకు రూ.1500 రూపాయలు అందించబోతున్నామని, అంటే ఒక్కో మహిళకు ఏడాది రూ .18 వేల రూపాయలు చొప్పున అందించబోతున్నామని, 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళా కూడా అర్హులే అంటూ తెలిపారు. ఈ పథకం కుటుంబ ఆదాయ పెరుగుదలకు లక్ష్యంగానే ప్రభుత్వం చేపడుతుందని తెలియజేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్ లేదా ఇతర కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ఈ పథకం కోసం ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా, రెసిడెన్స్ సర్టిఫికెట్, వయసుకు సంబంధించిన నిర్ధారణ పత్రాలు , మరికొన్ని వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైట్ https://ap. gov. Inlaadabiddanidhi వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి .
అక్కడ ఆన్లైన్ ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది..
దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళలు మాత్రమే అర్హులు.
దరఖాస్తు తేదీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఆర్థిక సహాయం అందించడమే ముఖ్య లక్ష్యం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి