పొత్తుల విషయంలో ఎన్డీఏతో కలిసే ప్రసక్తి లేదని, విజయ్ పార్టీ ఎన్డీఏలో చేరుతుందని ఈ మేరకు చర్చలు రాయబారాలు కూడా జరుగుతున్నాయని వార్తలు కేవలం పుకార్లే అంటూ టీవీకే పార్టీ తెలియజేసింది. ఈ విషయాన్ని టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తెలియజేశారు. బిజెపి పార్టీతో టీవీకే పార్టీ దూరం ఎందుకు ఉందని విషయం పైన మాట్లాడుతూ.. బిజెపి పార్టీ తమ పార్టీకి సైద్ధాంతిక శత్రువు , అందుకే ఆ పార్టీతో తాము దూరంగా ఉన్నామంటూ నిర్మల్ కుమార్ తెలియజేశారు. ఎలాంటి విషయాలైన కానీ టీవీకే పార్టీ క్యాడర్ నుంచి నేతల నుంచి అధికారికంగా వస్తేనే నమ్మాలి కాని ఇతరహా ప్రచారాలను ఎవరు నమ్మొద్దు అంటూ సూచించారు.
దీంతో తమిళనాడులో ఎన్డీఏతో విజయ్ పార్టీ మాత్రం పొత్తు లేదని మరొకసారి క్లారిటీ ఇచ్చింది. ద్రావిడ వాదాన్ని నమ్ముకుని టీవీకే పార్టీ ఏర్పాటు చేశామని మొదటి నుంచి చెప్పుకొచ్చారు విజయ్.వాటికి పూర్తిగా వ్యతిరేకత భావాజాలం అయినా బిజెపి పార్టీతో కలిస్తే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అంతేకాకుండా డిఎంకె సహ ప్రత్యర్థుల నుంచి విమర్శలు వస్తాయని భావిస్తున్నట్లు వినిపిస్తున్నాయి. కానీ రాజకీయాలలో ఎలా అయినా జరగవచ్చు, ప్రస్తుతం కొట్టి పారేసిన ఆ తర్వాత రాజకీయ ప్రకటనలు వెనక అసలు వ్యూహాలు ఉంటాయని పలువురు విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి