తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ ఇప్పుడు ఏపీలో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే పై లైంగిక వేధింపుల కేసు ఇంకా కొలిక్కి రాలేదు. రెండు నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ పైన జనసేన పార్టీ చర్యలు తీసుకోలేదంటూ హర్షవీణ మరో సంచలన వీడియోని విడుదల చేసింది. అందుకు కారణం ఎమ్మెల్యే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన పార్టీ ప్రకటించిన, శ్రీధర్ మాత్రం పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడంతో ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.


నిన్నటి రోజున రైల్వే కోడూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే శ్రీధర్ పాల్గొనగా మరో వీడియోని విడుదల చేసింది హర్ష వీణ. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనకూడదని అధినేత చెప్పిన శ్రీధర్ మాత్రం పలు కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అసలు పార్టీ అంటే శ్రీధర్ కు విలువ ఉందా? ఇదంతా కూడా జనసేన పార్టీ అధినేతకే తెలిసే జరుగుతోందా? అంటూ ఆ మహిళ ప్రశ్నించింది. తనకు న్యాయం చేయకపోతే జనసేన కార్యాలయం ఎదుటే తాను పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటూ సంచలన ప్రకటన చేసింది. తనకు అన్యాయం జరిగిందని బయటికి వస్తే జనసేన పార్టీ, ఇటు ప్రభుత్వం ఏమి చేయలేకపోతోంది అంటూ ఆవేదనని వ్యక్తం చేసింది.


తాను ఫేమస్ కావడానికి ఇదంతా చేయలేదని, మహిళల పట్ల ఎంతో గౌరవం, వారి సమస్యల పట్ల న్యాయం చేస్తారనే నమ్మకం ఏపీ డిప్యూటీ సీఎం పైన ఉండడంతో తాను బయటికి వచ్చాను అంటూ స్పష్టం చేసింది. తాను చేసిన ఆరోపణలలో నిజం లేకపోతే ఆ విషయాలను కూడా బయట పెట్టాలంటూ హర్షవీణ డిమాండ్ చేసింది. తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సరే సిద్ధంగానే ఉన్నానని, తాను చేసిన ఆరోపణలను నెగ్గు తేల్చడానికి త్రిసభ్య కమిటీ వేసినప్పుడే సగం సక్సెస్ అయ్యాను అంటూ తెలియజేసింది. కానీ వారి నుంచి ఎలాంటి రిపోర్టు ఇవ్వకుండానే జనసేన పార్టీ ఎమ్మెల్యే మళ్లీ జనాలను తిరుగుతున్నారని ప్రశ్నించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: