గడిచిన నాలుగు నెలల రూ .2500 కోట్ల నుంచి రూ.3000 కోట్ల రూపాయల వరకు చేరుకున్నాయని వీటి చెల్లింపు పైన ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని, ఆసుపత్రుల ప్రతినిధుల సైతం ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇన్సూరెన్స్ మోడల్ పద్ధతిని అమలు చేయాలని భావిస్తున్న ఈ విధానంపై ఆసుపత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.. 2017 నాటి పాత ప్యాకేజీ ధరలను ఇప్పటికి కొనసాగిస్తూ పెరిగిన వైద్య ఖర్చులు అలాగే ఆసుపత్రిలో నిర్వహణ భారంతో పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదంటూ తెలియజేస్తున్నాయి.
ఇప్పుడు పాత బకాయిల సంగతి తేల్చకుండానే ఇలా కొత్త ఇన్సూరెన్స్ మోడల్ కి మారితే ఆ రూ .3000వేల కోట్ల బకాయిల బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే విషయంపై కూడా ఇప్పుడు ఆసుపత్రుల యాజమాన్యంలో ఆందోళన నెలకొనింది. బకాయిలు అందకపోవడంతో చిన్న చిన్న ఆసుపత్రులు కూడా మూతపడే పరిస్థితి ఏర్పడిందని ఆర్థికంగా తాము చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ ధరలను సవరించి బకాయిలను వెంటనే విడుదల చేయాలని అలాకాకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళితే.. రోడ్డెక్కి పోరాడుతామంటూ ఆసుపత్రుల సంఘం హెచ్చరిస్తోంది. మరి ఈ విషయం పైన ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి