నాన్ ట్రేడ్ కస్టమర్లకు సిమెంటు ధరలను ఏకంగా రూ.50 రూపాయల వరకు పెంచాయి.. దీంతో ప్రస్తుతం సిమెంట్ ధర రూ .280 నుంచి రూ .320 రూపాయల వరకు ఉన్నప్పటికీ ఆ తర్వాత రూ .370 వరకు పెరగనుంది. కొన్ని ప్రాంతాలలో రూ.420 రూపాయల వరకు కూడా పెరిగినట్లు వినిపిస్తోంది. సిమెంట్ కంపెనీల నిర్మాణంగంపైన ఈ భారం మరింత పెరిగిపోయిందని ఇంధన ధరల పెరుగుదల రవాణా ఖర్చులు పెరుగుదల నేపథ్యంలో ఈ ధరలను పెంచినట్లుగా తెలుస్తోంది. పెంచిన సిమెంటు ధరలు నాలుగవ తేదీ అర్ధరాత్రి నుంచి 50 రూపాయల వరకు ఒక్కో బస్తా పైన అమలవుతుందని తెలుసి చాలామంది డీలర్లు పాత ధరకే స్టాకుని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇల్లు కట్టుకునే వారికి ఇది పెద్ద షాక్ అని చెప్పవచ్చు. ఇప్పటికే అధిక ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులు ఇప్పుడు మరింత భారం పడనుంది.
పచ్చిమసియాలో ఉద్రిక్తత పరిస్థితుల వల్ల విమాన రంగం పైన కూడా ఆ ఎఫెక్ట్ చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఉంది. విమాన ఫ్యూయల్, ధరలు కూడా అమాంతం పెరగడంతో దేశీ అంతర్జాతీయ విమాన టికెట్ ధరలు కూడా పెరగనున్నాయి. కిందన ధరలు భారం గా పెరగడంతో విమాన సంస్థలు ఆదరణకు ఖర్చులను ప్రయాణికుల పైన మళ్లించే పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి