మొత్తం 14,553 పోస్టులలో మెజారిటీ పోస్టులలో ఎక్కువగా సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ విభాగాలలోనే ఖాళీగా ఉన్నట్లు తెలియజేశారు. ఇందుకు సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతి రావుగానే రిక్రూమెంట్ మొదలుపెడతామని త్వరలోనే అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఇక అభ్యర్థులకు ఉండవలసిన ప్రాథమిక అర్హతలు ఇలా ఉండవచ్చు అని ఒక నివేదిక వైరల్ గా మారింది
కానిస్టేబుల్ పోస్టులకు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హతగా ఉండవచ్చు.
సబ్ ఇన్స్పెక్టర్ (SI) ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత అయ్యుండాలి.
వయసు విషయానికి వస్తే.. 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 30 ఏళ్ల వరకు ఉండవచ్చు, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈ డబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయో పరిమితుల సడలింపు ఉంటుంది.
అభ్యర్థుల ఎంపీక విధానం నాలుగు దశలలో ఉంటుంది. మొదటి ప్రిలిమనరీ రాత పరీక్ష ఇందులో క్వాలిఫై అయిన వారు శారీరక ప్రమాణాల పరీక్ష (PMT) ఇందులో ఎత్తు బరువు వంటి శారీరక కొలతలను తనిఖీ చేస్తారు.
PET: రన్నింగ్, లాంగ్ జంప్ వంటి వాటిలో అభ్యర్థులు పాల్గొనాలి.
తుదిరాత పరీక్ష: ఈ ఎంపికలో వచ్చే మార్పులే అభ్యర్థులకు కీలకం అనంతరం మెరిట్ ఆధారంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ నిర్వహించి అభ్యర్థులకు నియమ పత్రాలను అందజేస్తారు. త్వరలోనే కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వెలబడనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి